EntertainmentLatest News

‘స్కంద’ పబ్లిక్ టాక్.. తెలుగు రాష్ట్రాల CMల రచ్చ!


రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ పోతినేని,బోయపాటి శ్రీనుల స్కంద మూవీ ఈ రోజు థియేటర్స్ లో కి అడుగుపెట్టింది. అడుగు పెట్టడమే కాదు టాలీవుడ్ దద్దరిల్లిపోయే లెవల్లో ఓపెనింగ్స్ ని రాబట్టింది. రామ్ పోతినేని సినీ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ ని తెచ్చుకున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే షో స్ మొదలయ్యాయి. రామ్ అండ్ బోయపాటి అభిమానుల కోలాహలంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం వచ్చింది.సినిమా కూడా సూపర్ గా ఉందని చుసిన ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అసలు  సినిమా లో రామ్ ఎంట్రీ అయితే ఒక రేంజ్ లో ఉందని యాదవులు జరుపుకొనే సదరు పండుగ లో రామ్ ఇచ్చిన ఎంట్రీ సూపర్ గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

ఫస్ట్ ఆఫ్ లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుటుంబ గొడవలతో సినిమా ప్రారంభం అవ్వడం చాలా కొత్తగా ఉందని అలాగే ఆ గొడవల్లోకి రామ్ పోతినేని ఎంట్రీ ఇవ్వడం సూపర్ గా ఉందని అంటున్నారు. హీరోయిన్ శ్రీ లీల కూడా చాలా అందంగా ఉందని మరో సారి ఈ సినిమా లో డాన్స్ ఇరగదీసిందని ముఖ్యంగా గండరబాయి సాంగ్ అయితే సినిమా మొత్తానికే హైలెట్ గా నిలిచిందని ఆడియన్స్ అందరు చెప్తున్నారు అలాగే సెకండ్ ఆఫ్ లో మైటీ స్టార్ శ్రీకాంత్ పోషించిన పాత్ర ఒకప్పటి సాఫ్ట్ వెర్ దిగ్గజం సత్యం రామలింగరాజు ని పోలి ఉందని  అంటున్నారు .ఇంక క్లైమాక్స్ ఫైట్  అయితే ఒక రేంజ్ లో ఉండి సినిమా ఘన విజయం సాధించడానికి కారణం అయ్యిందని అంటున్నారు. అలాగే సినిమా చివరలో స్కంద 2 కుడా ఉంటుందని కూడా చెప్పారు .టోటల్ గా చెప్పాలంటే  ఫస్ట్ ఆఫ్ లో ఎమోషన్స్ ,సెకండ్ ఆఫ్ లో ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్  బాగా పండిందని మరోసారి బోయపాటి మేజిక్ కుదిరిందని లాజిక్ లు పక్కన పెట్టి చూస్తే మంచి మాస్ సినిమా స్కంద అని అందరూ అంటున్నారు.



Source link

Related posts

Electric Bus Maker Olectra Greentech Limited Reports Rs 27 Crores Net Profit For Q3

Oknews

ఊహించని అతిథులతో గ్రాండ్‌గా చెర్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Oknews

Medak Crime 3 people dies on the spot in Road Accident

Oknews

Leave a Comment