దిశ, ఫీచర్స్ : మన ఆలోచనే మన జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని నేర్చుకోవాలి అంటారు పెద్దవారు. ముఖ్యంగా మనం ఏ వృత్తిలోనైనా సరే నిలదొక్కుకోవాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. ఇక కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అనేది మన మెదడును పదును చేసుకోవడానికి గొప్ప మార్గంగా ఉంటుంది. అయితే మనం మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం : మీరు ఏదైనా పని లేదా గమ్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అంతే కాకుండా దాని గురించి మీకు మీరుగా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాలి. అలాగే మీరు ఈ పని చేయగలం అనే నమ్మకం ఉన్నప్పుడే మీరు ఆ పనిని ఎంచుకోవాలి. అప్పుడే దాన్ని మీరు సాధించగలరు.
2. చిన్నగా ప్రారంభించండి : మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని చిన్న చిన్న విభాగాలుగా విభజించుకోవాలి. ఒకే సమయంలో రెండు లేదా మూడు పనులు చేయడం వంటివి చేయడం వలన మీరు ఏకాగ్రత పెట్టలేదు. దాని వలన మీరు ఏం నేర్చుకోరు. అలాగే ఒకే సారి మొత్తం నేర్చుకోవడం కూడా కుదరదు. అందుకే కొంచెం కొంచెంగా భాగాలుగా విభజించుకుని మీ పనిపై మీరు శ్రద్ధ పెట్టాలి.
3. మీరు ఎందుకు ఈ లక్ష్యాన్ని ఎంచుకున్నారో గుర్తుంచుకోవాలి
మీరు ఏదైనా పని చేయాలనుకున్నా , లేదా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు. దాని ప్రాముఖ్యత తెలుసుకోవడం చాలా అవసరం. సక్సెస్ కావాలంటే, మీరు చేసే పని గురించి మీకు తెలిసి ఉండాలి.కొన్ని సందర్భాల్లో పలు సమస్యలు మీ పనిని నిరోధించవచ్చు. కానీ వాటన్నింటిని తట్టుకొని, మీ స్వీయ అనుభవంతో మీరు ఎంచుకున్న పనిని పూర్తి చేయాలి. దాని ద్వారా మీరు జీవితంలో ఎలా ఎదగాలి అనే ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మీరు ఆలోచించే విధానాన్ని లేదా ప్రపంచాన్ని చూసే విధానాన్ని మారుస్తుంది.
4. అంతర్గత ప్రేరణ : మీరు మీకు కష్టమైన పని కాకుండా,మీరు ఏ పనినైతే ఎక్కువ ఇష్టంగా చేస్తారో దానినే చేయాలి. అంతర్గత ప్రేరణ అనేది దాని స్వంత ప్రయోజనం కోసం ఏదైనా చేయాలనుకోవడం. ఏదైనా అంతిమ లక్ష్యాన్ని సాధించడం కంటే ఏదో ఒక పని చేయడం వల్ల కలిగే ఆనందంపై దృష్టి ఉంటుంది. సంగీతం మరియు కళలు, పఠనం, మేధోపరమైన ఆవిష్కరణలు, క్రీడలు ఇలా సంతృప్తికరమైన సాధనల వంటి కార్యకలాపాలు తరచుగా చేయడం వలన మీరు త్వరగా నేర్చుకోవడమే కాకుండా ఆనందంగా ఉండగలుగుతారు.
5. ఏదైన ఆలోచించి నేర్చుకోవాలి : దాని వల్ల ఏది ఎలా ఉంటుంది. ఎక్కడి వెళ్తుందనేది నేర్చుకోవచ్చు. సగం సగం నేర్చుకునే పద్దతిలో సగం సగం ఫలితాలను పొందుతాము. అందువల్ల నేర్చుకునే విషయంలో నిధానమే ప్రధానం. దాని వల్ల పూర్తి విషయంపై అవగాహన రావడంతో పాటు అనవసర గందరగోళం రాకుండా ఉంటుంది. అయితే వేగంగా నేర్చుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు
6. ఆలోచనా విధానాన్ని పెంచుకోవడం : కొంత మందిలో ఆలోచన శక్తి ఎక్కువగా ఉండదు.కానీ మీరు ఏదో ఒక పనిలో నిబద్ధతగా ఉంటూ, నేర్చుకోవడం వలన ఆ దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు. దాని వలన మీ ఆలోచన శక్తి రోజు రోజుకు పెరుగుతుంది.