50 ప్రశ్నలు
శనివారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో చంద్రబాబును ప్రశ్నించారు. ఉదయం దాదాపు గంటన్నరపాటు చంద్రబాబును ప్రశ్నించిన సీఐడీ అధికారులు… భోజన విరామంతో పాటు మొత్తం నాలుగుసార్లు విరామం ఇచ్చారు. చంద్రబాబు వయసు రీత్యా వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉంచారు. అయితే మొత్తం 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన సీఐడీ బృందం 50 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీమెన్స్ సంస్థతో ఒప్పందం, లావాదేవీలపై ముఖ్యంగా చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు, సాక్ష్యాధారాలు లేకుండా చేసే ప్రయత్నాలపై సీఐడీ ప్రశ్నించింది. డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టుకు అనుమతి తెలిపారు? ఆర్థికశాఖ సెక్రటరీ వద్దన్నా, నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నలు వర్షం కురిపించారు.