Health Care

స్టాక్ హోమ్ సిండ్రోమ్ .. హింసించే వారితో ప్రేమలో పడిపోయే రోగం


దిశ, ఫీచర్స్: సాధారణంగా మనను బాధ పెట్టేవారిని అసహ్యించుకుంటాం. టార్చర్ చేసే వారిని జైలుకు పంపించి ఊచలు లెక్కపెట్టించాలని కోపంతో ఊగిపోతం. ఎలాగైనా రివేంజ్ తీసుకోవాలని కోరుకుంటాం. మనవల్ల కాదని తెలిసినప్పుడు చేతులు ముడుచుని కూర్చుంటాం. కానీ కొందరు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. హింసించే వారితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. బంధించి నరకయాతన పెట్టిన వ్యక్తితోనే ప్రేమలో పడిపోతారు. ఎవరెన్ని చెప్పినా నేరస్థుడు మంచివాడని సమర్ధిస్తారు. కాగా ఇదీ ఒక రోగమే అంటున్న నిపుణులు .. ‘ స్టాక్ హోమ్ సిండ్రోమ్ ‘ గా పరిగణిస్తున్నారు. ఇంతకీ ఇది ఎప్పుడు గుర్తించబడింది? ఈ సిండ్రోమ్ కు ఈ పేరు ఎలా వచ్చింది? బాధితులు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడొచ్చు? తెలుసుకుందాం.

స్టాక్‌హోమ్ సిండ్రోమ్ అనేది ఒక రకమైన ట్రామా బాండింగ్ . బాధితుడు లేదా వేధింపులకు గురైన వ్యక్తి వారి నేరస్థులతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకునే పరిస్థితి. ఇది 1973లో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన ఒక సంఘటన తర్వాత ఈ రోగాన్ని గుర్తించారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం బ్యాంక్ దోపిడీకి వచ్చిన ఇద్దరు దొంగలు… నలుగురు బ్యాంకు ఉద్యోగులను ఆరు రోజుల పాటు బందీలుగా ఉంచారు. ఆ సమయంలో బాధితులు దొంగలతో భావాలు పంచుకున్నారు. భావోద్వేగ బంధాలను పెంచుకున్నారు. ఆ తర్వాత కేసు పరిష్కారమైనప్పుడు కూడా వారికే సపోర్ట్ ఇచ్చారు. దొంగలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించారు.

లక్షణాలు

* బంధీలపై పాజిటివ్ ఒపీనియన్

సాధారణంగా ఈ రోగం బాధితుడు.. నేరస్తుడి పట్ల ఎమోషనల్ బాండింగ్ పెంచేందుకు కారణం అవుతుంది. ఈ పరిస్థితి బాధితుడితో పాటు చూస్తున్న వారిని గందరగోళంలో పడేస్తుంది. జర్నల్ ఆఫ్ సైకోసోషల్ వెల్బీయింగ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో.. బాధితులు తమ బంధీలతో గడిపే సన్నిహిత సమయంలో ఈ బంధాన్ని పెంచుకుంటారు. బంధించిన వ్యక్తి బాధితురాలి ప్రాణాలు తీస్తానని బెదిరించినా.. చంపనప్పుడు సాధారణంగా ఇది జరుగుతుంది. వారిలో మానవత్వం ఉందని నమ్ముతారు. ఇకపై వారి నుంచి ఎలాంటి ముప్పు ఉండదని, చాలా మంచివారని విశ్వసిస్తారు. వారికి శిక్షలు పడకుండా కాపాడే ప్రయత్నాలు కూడా చేస్తారు. పోలీసులు, కోర్టులకు సహకరించరు.

* తప్పించుకోలేని అసమర్థత

BMC ఇంటర్నేషనల్ హెల్త్ అండ్ హ్యూమన్ రైట్స్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. సెక్స్ వర్కర్లు నెలలపాటు హింసించబడ్డారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా తప్పించుకోలేకపోయారు. బంధీలుగానే ఉండిపోయారు. కాగా ఇలాంటి పరిస్థితులు స్టాక్ హోమ్ సిండ్రోమ్ కు దారితీస్తున్నాయి.

ప్రస్తుతం ఎలాంటి వారిలో ఈ లక్షణాలున్నాయి?

* భర్త భార్యను గృహ హింసకు గురిచేస్తున్నా.. తను మాత్రం హస్బెండ్ పై ప్రేమ పెంచుకుంటుంది. కారణం అలా ఉంటేనే ఎక్కువ కాలం జీవిస్తామనే ఆలోచన తన బ్రెయిన్ సబ్ కాన్షియస్ గా సెట్ అయిపోతుంది.

* ఒక వ్యక్తి చిన్న పిల్లను లైంగికంగా వేధిస్తున్నాడు అనుకుందాం. కొందరిలో ఈ పరిస్థితి అతనితో బంధాన్ని ఏర్పరుచుకునేందుకు దారితీస్తుంది. పెద్దయ్యాక కూడా అతనితో అలాంటి బంధాన్నే కోరుకుంటుంది.

* రోజువారీ అవసరాలైన డబ్బు లేదా ఆహారం కోసం దుర్వినియోగదారులపై ఆధారపడే సెక్స్ వర్కర్లలో స్టాక్ హోమ్ సిండ్రోమ్ కనిపిస్తుంది. తమను గాయపరిచే వ్యక్తి పట్ల సానుకూల భావాలను పెంపొందించుకుంటారు. BMC ఇంటర్నేషనల్ హెల్త్ అండ్ హ్యూమన్ రైట్స్ నిర్వహించిన ఒక అధ్యయనం , భారతదేశంలో సెక్స్ వర్కర్ల పరిస్థితిని విశ్లేషించింది. శారీరక ఒంటరితనం, మానసిక నిరుత్సాహం ఇందుకు కారణం అవుతుందని గుర్తించింది.

ట్రీట్మెంట్

స్టాక్‌హోమ్ సిండ్రోమ్‌కు సంబంధించిన చికిత్సా విధానం బాధితుడు అనుభవించే లక్షణాల తీవ్రతను బట్టి మందులు , థెరపీ లేదా రెండింటి కలయికతో ఉండవచ్చు. ఇది PTSD, ఒత్తిడి, డిప్రెషన్, ఇతర సంబంధిత లక్షణాల నుంచి కోలుకోవడానికి సహాయపడతుంది. “బాధితుడు వారు భావించే విధానాన్ని ప్రాసెస్ చేయడంలో సహాయపడే కోపింగ్ మెకానిజం నేర్చుకోవడంలో చికిత్సకుడు సహాయం చేయవచ్చు. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ఆలోచనలను పునర్నిర్మించడంలో హెల్ప్ చేస్తుంది. తద్వారా బాధితుల వైఖరి, నమ్మకాలను మరింత నిర్మాణాత్మక మార్గాల్లో రూపొందిస్తుంది” అని చెప్తున్నారు నిపుణులు



Source link

Related posts

ఓట్స్ మసాలా వడలు ఈ విధంగా తయారు చేసుకోండి

Oknews

Ugadi Panchangam : ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా అంతా శుభమే!

Oknews

విమానంలో వెళ్తే ఒక కాయను అస్సలే తీసుకెళ్లకూడదంట.. అది ఏమిటో మీకు తెలుసా?

Oknews

Leave a Comment