EntertainmentLatest News

స్టార్‌ హీరోతో హీరోయిన్‌ ఎఫైర్‌.. వార్నింగ్‌ ఇచ్చిన భార్య!


లవ్‌, డేటింగ్‌, ఎఫైర్‌, రిలేషన్‌ షిప్‌, పెళ్లి, విడాకులు…ఇలాంటి మాటలు మనం సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా వింటూ ఉంటాం. ఇలాంటి విషయాలు చదవడానికి,  తెలుసుకోవడానికి రీడర్స్‌ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని మీడియా సంస్థలు గోరంతను కొండంత చేసి రీడర్స్‌లో క్యూరియాసిటీని కలిగిస్తారు. అయితే అలాంటిదేమీ లేకుండా చాలా క్లియర్‌కట్‌గా ఒక స్టార్‌ హీరో నడుపుతున్న ఎఫైర్‌లో అతని భార్య జోక్యం చేసుకొని సదరు ఆ హీరోయిన్‌కి వార్నింగ్‌ ఇచ్చిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. 

కన్నడలో స్టార్‌ హీరోగా ఉన్న దర్శన్‌ విషయంలో ఇది జరిగింది. దర్శన్‌, పవిత్ర గౌడ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ క్రమంలో వారి మధ్య స్నేహం, ప్రేమ.. వగైరా వగైరా ఏర్పడ్డాయి. చాలా కాలం నుంచి ఇద్దరూ రిలేషన్‌ షిప్‌లో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. ఆనోటా, ఈ నోట విషయం దర్శన్‌ భార్యకు తెలిసింది. దాంతో ఫైర్‌ అయిపోయిన దర్శన్‌ భార్య విజయలక్ష్మీ.. ఆ హీరోయిన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చిందట. ఈ కారణంగా దర్శన్‌కు, విజయలక్ష్మీకి మధ్య విభేదాలు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. పవిత్రగౌడతో విజయలక్ష్మీ గొడవ పెట్టుకున్న విషయం ఇప్పుడు శాండల్‌వుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయిపోయింది. ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కన్నడ మీడియాలో వినిపిస్తున్న మాటలు. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలియదుగానీ దీనికి మరింత బలం చేకూర్చేలా పవిత్ర గౌడ ప్రవర్తన ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

తాను దర్శన్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోలను ఓ వీడియోగా రూపొందించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది పవిత్ర. దీంతో మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని ఫిక్స్‌ అవుతున్నారందరూ. ఆ వీడియోకు ‘మన పదేళ్ళ రిలేషన్‌ షిప్‌ ఎప్పటికీ ఇలాగే ఉండాలి’ అనే క్యాప్షన్‌ కూడా ఇవ్వడంతో దర్శన్‌ భార్య విజయలక్ష్మీకి మరింత మండిపోయిందట. ఇకపై దర్శన్‌తో కలిసి ఎక్కడైనా కనిపిస్తే మామూలుగా ఉండదని వార్నింగ్‌ ఇచ్చిందట. అసలు ఈ ముగ్గురి వ్యవహారం ఏమిటి అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. పవిత్రగౌడ పోస్ట్‌ చేసిన ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోతున్నాయి. 



Source link

Related posts

Kodali Nani good bye to politics! రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!

Oknews

ప్రేక్షకులు లేక లాల్ సలామ్ షోస్ రద్దు

Oknews

డ్రగ్స్ కేసులో దొరికిన ప్రముఖ హీరో లవర్ 

Oknews

Leave a Comment