Entertainment

స్టార్ హీరోల రేంజ్ లో  టిల్లు హంగామా..ఓవర్ సీస్ లో రికార్డు  


హైదరాబాద్ కి చెందిన టిల్లు గాడు ఇప్పుడు దునియా మొత్తం దున్నేస్తున్నాడు.రీసెంట్ గా 100 కోట్ల క్లబ్ లో చేరిన టిల్లు ఇప్పుడు మరో సంచలనాన్ని సృష్టించాడు. స్టార్ హీరోల రేంజ్ లో రికార్డు సృష్టించి  తనని ఎందుకు స్టార్ బాయ్ అంటారో నిరూపించాడు.   

 2022 లో వచ్చిన  డిజె టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే  టిల్లు స్క్వేర్. గత నెల మార్చి 29 న వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని పొంది భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు  ఓవర్ సీస్ లో సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతుంది. రీసెంట్ గా 2.8 మిలియన్ మార్కుని సాధించింది. దీంతో  ఈ వీకెండ్ లో 3 మిలియన్ దాటడం పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు ఇది  సిద్దు కెరీర్ లోనే రికార్డు కలెక్షన్స్  అని చెప్పవచ్చు.   

ఇక టిల్లు స్క్వేర్ లోని సిద్దు నటనకి యూత్  మొత్తం ఫిదా అవుతుంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉన్నారంటే చిత్రం యొక్క విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అనుపమ పరమేశ్వరన్  నటన కూడా చాలా కొత్తగా ఉండి ప్రేక్షకులకి ఫ్రెష్ నెస్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో మెరిసిన నేహా శెట్టి స్క్వేర్ లో  కాసేపు కనపడటం కూడా  ప్లస్ పాయింట్ గా నిలిచింది. రామ్ మల్లిక్ దర్శకత్వం వహించగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. థియేటర్స్ దగ్గర వాతావరణం చూస్తుంటే ఇప్పుడప్పుడే టిల్లు హంగామా తగ్గేలా లేదు. అట్లుంటది మరి మనోడితోటి.

 



Source link

Related posts

టిల్లు స్క్వేర్ వీక్ కలెక్షన్స్..అందరు షాక్ 

Oknews

శ్రీవిష్ణు వంశం ఏంటి? దాని చరిత్ర ఏంటో తెలుసా?

Oknews

‘మంజుమ్మల్ బాయ్స్’ డైరెక్టర్ ఫస్ట్ తెలుగు మూవీ.. హీరో ఎవరు..?

Oknews

Leave a Comment