EntertainmentLatest News

స్థలాన్ని మహేష్ బాబు లీజుకు తీసుకున్నాడు.. 2010 నుంచి  థియేటర్ లేదు   


మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే  చాలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదు అవుతుంటాయి. అంతలా ఆయన సినిమాలకి ఆదరణ ఉంటుంది. బాల నటుడుగా చిత్ర రంగ ప్రవేశం చేసిన మహేష్ కి తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం 40 సంవత్సరాల పై మాటే. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు సినిమాకి పేరు ప్రఖ్యాతులని కూడా తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతం. ఇప్పుడు  ఆయనకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

మహేష్ బాబు  సినిమా థియేటర్స్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం అందరకి తెలిసిందే. ప్రముఖ సినీ పంపిణి సంస్థ ఏషియన్ మూవీస్ తో కలిసి ఏఎంబి సినిమాస్ పేరుతో  అధునాతన ఫ్యూచర్స్ తో కూడిన మల్టీప్లెక్స్  థియేటర్స్ లని నిర్మించాడు. ఇప్పుడు మరో మల్టీప్లెక్స్ ని  నిర్మించనున్నాడు.హైదరాబాద్ ఆర్టీసీ  క్రాస్ రోడ్స్ లో ఒకప్పుడు సుదర్శన్ 70 ఎంఎం అనే థియేటర్ ఉండేది. 2010  నుంచి  ఆ థియేటర్ రన్నింగ్ లో లేదు.పైగా థియేటర్ ని కూల్చివేయడం జరిగింది. ఇప్పడు ఆ స్థలాన్ని మహేష్ లీజుకి తీసుకొని  మల్టీప్లెక్స్  ని కట్టబోతున్నాడు. ఈ విషయంపై మరికొన్ని రోజుల్లో పూర్తి విషయాలు బయటకి రానున్నాయి

సోషల్ మీడియా ద్వారా ఈ వార్తని చూసిన మహేష్ ఫ్యాన్స్ అండ్ సినీ ప్రేమికులు  మహేష్ చాలా గ్రేట్ అని పొగుడుతున్నారు. ఎందుకంటే సినిమాల ద్వారా సంపాధించిన  డబ్బుని  తిరిగి సినిమా థియేటర్స్ నిర్మించడం ద్వారా మహేష్ కళామతల్లి రుణం తీర్చుకున్నట్టవుతుందని  అంటున్నారు. ఇండియన్ బిగెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన  రాజమౌళి తో మహేష్ తన తదుపరి సినిమా చెయ్యబోతున్నాడు.   

 



Source link

Related posts

మోక్షజ్ఞ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా! బాలయ్య కి సాధ్యం కాలేదు కదా

Oknews

యష్, అల్లు అర్జున్ లో ఆపేదెవరు!

Oknews

‘కల్కి 2898 AD’ ఓటీటీ అప్డేట్.. అసలు జనాలు చూస్తారా..?

Oknews

Leave a Comment