Health Care

స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. ఇలా చేస్తే సరి!


దిశ, ఫీచర్స్ : ఏదో పనిలో బిజీగా ఉంటారు.. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగుతుంది. తీరా చూస్తే అదేదో స్పామ్ కాల్ అయి ఉంటుంది. బైకుపైనో, కారు డ్రైవింగ్‌లోనో ఉంటారు.. కాల్స్ అదేపనిగా వస్తుంటాయి. అన్నిసార్లు చేస్తున్నారంటే ఏదో ఇంపార్టెంట్ అయ్యుంటుందని వాహనం రోడ్ సైడ్ ఆపుకొని కాల్ లిఫ్ట్ చేస్తే.. అంతా తూచ్.. ఏ క్రెడిక్ కార్డ్ ఆఫర్ అనో, షాపింగ్ మాల్ డిస్కౌంట్ అనో అవతలి నుంచి ఓ స్వీట్ వాయిస్.. మీరున్న పరిస్థితిలో ఆ క్షణం చిర్రెత్తుకొస్తుంది. ఇలా ఎంతోమంది స్పామ్ కాల్స్‌తో, ఫేక్ కాల్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. సైబర్ నేరగాళ్లు కూడా మోసాలకోసం ఇలాంటి కాల్స్ చేస్తుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ వాడే వారికి ఈ డిస్టర్బెన్స్ నుంచి బయటపడే మార్గం ఒకటి ఉందంటున్నారు నిపుణులు. ఏంటంటే..

ప్రజెంట్ స్మార్ట్‌ఫోన్ యూజర్లయితే ట్రూ కాలర్ వంటి యాప్‌లతో స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చే చాలా ఫోన్లలోనూ సహజంగానే యాంటీ స్పామ్ కాల్స్ ఫీచర్లు ఉంటున్నాయని కూడా నిపుణులు అంటున్నారు. ఐఫోన్లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ తరహా ఫేక్ కాల్స్‌ను అడ్డుకోవడం ఇప్పుడు ఈజీనే. అందుకోసం ముందుగా గూగుల్ ఫోన్ యాప్‌ను లేదా ట్రూ కాలర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి సజెషన్స్ అనుసరిస్తూ డైలర్‌గా సెట్ చేసుకోవాలి. తర్వాత యాప్‌ను రీఓపెన్ చేసి మెయిన స్ర్కీన్‌లో త్రీ డాట్స్ మెనూను క్లిక్ చేయాలి. అక్కడి నుంచి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘కాలర్ ఐడీ అండ్ స్పామ్’ను క్లిక్ చేసి ఎనేబుల్ ఫిల్టర్ స్పామ్ కాల్స్ ఆప్షన్‌పై మరోసారి క్లిక్ చేయాలి. దీంతో మీ ఫోన్ ఇక నుంచి స్పామ్ కాల్స్‌ను తనంతట తనే అవైడ్ చేస్తుందని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 



Source link

Related posts

జర్నీలో అదేం పని!.. ఆ యువతులు చేసిన పనికి అందరూ షాక్

Oknews

పంచదార, బెల్లం మధ్య తేడా ఇదే.. వీటిలో ఏది మంచిది?

Oknews

మగవారు ఏ వయసులో పిల్లలు కనవచ్చు.. పిల్లలు పుట్టకపోవడానికి వీరు కూడా కారణమేనా?

Oknews

Leave a Comment