మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలను కంప్లీట్ చేయటంలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. ాయన స్పీడు చూస్తుంటే మిగిలిన హీరోలు వామ్మో అనుకోవాల్సిందే. ఎందుకంటే అంత స్పీడుగా సినిమాలను కంప్లీట్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గానే స్టార్ట్ చేసిన ఓ భారీ యాక్షన్ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ వరుణ్ తేజ్ కంప్లీట్ చేసిన సదరు భారీ యాక్షన్ మూవీ ఏది.. దర్శకుడెవరు? రిలీజ్ ఎప్పుడూ అనే వివరాల్లోకి వెళితే…
సాధారణంగా మెగా హీరోలంటే మాస్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే దానికి వరుణ్ తేజ్ ఫుల్ స్టాప్ పెడుతూ విలక్షణమైన సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వరుణ్ తేజ్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తున్నారు. ఆయన హీరోగా రూపొందుతోన్న బాలీవుడ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. దీన్ని హిందీతో పాటు తెలుగులోనూ రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఇందులో హీరోయిన్. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్‌ఫోర్స్ ఫైలైట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాతో మానుషి చిల్లర్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈచిత్రంలో ఆమె రాడార్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ సహా అందరూ ఈ విషయాన్ని తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
బాలీవుడ్ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావటంతో ఇక మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై ఫోకస్ పెడుతున్నారు. మరో వైపు వరుణ్ తేజ్ తన ప్రేయసి, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న సంగతి తెలిసిందే.