గతంతో పోలిస్తే హారర్ సినిమాలకు ఆదరణ ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. ప్రేక్షకులు భయపడుతూ ఎంజాయ్ చెయ్యడానికి బాగా ఇష్టపడుతున్నారు. అందుకే హారర్ బేస్డ్ మూవీస్ ఘనవిజయం సాధిస్తున్నాయి. కొంతమంది ప్రముఖ హీరోయిన్లు కూడా ఈ తరహా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేశముదురు’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలో తన అందచందాలతో అలరించింది. ఇప్పుడు తమిళ్ సినిమాలు ఎక్కువగా చేస్తూ కోలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయింది. కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గార్డియన్’ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. శబరి, గురు శరవణన్ దర్శకత్వంలో పూర్తి హారర్ మూవీగా ‘గార్డియన్’ రూపొందుతోంది. రెగ్యులర్ సినిమాల్లోలా కాకుండా ఈ సినిమాలో హన్సికను డిఫరెంట్‌గా చూపించబోతున్నామని దర్శకులు తెలిపారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ రిలీజ్ తర్వాత సినిమా అంచనాలు బాగా పెరిగాయి. హారర్ సినిమాలు ఏ భాషలో తీసినా ఆకట్టుకుంటాయని గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ సినిమాలో హన్సిక ఒక సాధారణ అమ్మాయిగా నటించింది. ఎవరూ ఊహించని విధంగా ఆమెను ఒక ఆత్మ పీడిస్తూ ఉంటుంది. దాంతో దెయ్యంగా మారిన హన్సిక ఏం చేసింది అనేది చిత్ర కథాంశం. ప్రముఖ దర్శకుడు విజయ్ చందర్ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. సామ్ సిఎస్ సంగీతాన్ని అందించాడు.