Top Stories

హాట్ హీరోయిన్ ప్రైవేటు ఫొటోలు లీక్


అనన్య పాండే గుర్తుందా.. విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే సినిమాలో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఆమెకు చెందిన కొన్ని ప్రైవేటు ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడమే.

ఆదిత్య రాయ్ కపూర్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ విదేశాలకు చెక్కేస్తుంటారు. ఎంచక్కా కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, తిరిగి స్వదేశానికి వస్తుంటారు. జనవరి 1కి కూడా వీళ్లు ఆస్ట్రేలియా వెళ్లారు.

అక్కడ ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలు కొన్ని ఊహించని విధంగా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వీటిపై తాజాగా అనన్య పాండే స్పందించింది. ఇలాంటి ఘటనలు తనను బాధపెట్టవని, ఓ నటిగా మారినప్పుడే ప్రైవసీ విషయంలో తాము కాంప్రమైజ్ అవుతామని వెల్లడించింది.

వీళ్లిద్దరూ తమ బంధాన్ని ఇప్పటికే పరోక్షంగా వెల్లడించారు. కాఫీ విద్ కరణ్ షోలో తననుతాను అనన్య కపూర్ గా పరిచయం చేసుకుంది అనన్య పాండే. అటు ఆదిత్య రాయ్ కపూర్ కూడా అనన్యతో ఎఫైర్ ను పరోక్షంగా నిర్థారించారు.

వ్యక్తిగత విషయాల్ని వీలైనంత గోప్యంగా ఉంచడానికి తను ప్రయత్నిస్తానని, కానీ తన చుట్టు జరిగే చాలా విషయాల్ని నియంత్రించే శక్తి తనకు లేదని చెప్పుకొచ్చింది అనన్య. ఆ మధ్య ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరైన ఆనన్య.. గుప్పుగుప్పుమంటూ సిగరెట్ తాగుతూ కెమెరాకు దొరికిపోయింది.



Source link

Related posts

ప‌వ‌న్‌ను రేవంత్ అలా పోల్చాడేంటి!

Oknews

తాయిలాలు ఒక్కటే బుజ్జగింపుల మార్గం!

Oknews

ఊహూ.. బాబుకు ద‌క్క‌ని ఊర‌ట‌!

Oknews

Leave a Comment