Health Care

హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్లు నీరు ఎక్కువగా తాగకూడదా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..


దిశ, ఫీచర్స్ : నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలోనూ ఇది చాలా ముఖ్యం. అలాగే ఒత్తిడి, అలసటలను దూరం చేయడంలో, బరువు తగ్గడంలో, మెరుగైన రక్త ప్రసరణలో, మానసిక మెరుగుదలలో నీరు కీలకపాత్ర పోషిస్తుంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం మోతాదుకు మించి తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే..

డైలీ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్ చెప్తుంటారు. అయితే గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం కొంతమేర తగ్గించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే అధిక నీరు హృద్రోగుల శరీరంలో పలు సమస్యలకు దారితీస్తుంది. వీరు సాధారణ స్థాయిలో నీరు తాగడంవల్ల సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడంలో దోహదం చేసే నీరు. అదే మోతాదుకు మించినప్పుడు మాత్రం ఈ సమతుల్యతను దెబ్బ తీస్తుందని నిపుణులు అంటున్నారు.

హార్ట్ పేషెంట్లు అధిక మొత్తంలో నీరు తాగడంవల్ల.. అంటే రోజుకు రెండు లీటర్లకు మించి తాగితే గుండె పంపింగ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయని, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా ధమనులు బలహీనపడతాయని, హార్ట్ రేట్ పెరిగి కార్డియాక్ అరెస్టు, గుండె పోటు వంటి రిస్కులు కూడా పెరగవచ్చునని అంటున్నారు. కాబట్టి హృద్రోగులు రోజుకు రెండు లీటర్ల నీరు తాగడం మంచిదని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కువగా తాగాలనిపిస్తే 3 లీటర్లకు మించవద్దని సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. నిర్ధారణలు, పర్యవసనాలకు ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 



Source link

Related posts

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వంట.. ఆరోగ్యానికి మంచిదేనా?

Oknews

వేడి నీరు తాగుతున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే..

Oknews

లీప్ ఇయర్ అంటే ఏమిటి? ఇది ఫిబ్రవరిలోనే ఎందుకు వస్తుందో తెలుసా?

Oknews

Leave a Comment