దృశ్యం.. 2014 లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్నే సాధించింది. అలాగే విమర్శకుల ప్రశంసల్ని కూడా అందుకుంది. వెంకటేష్ పోషించిన రాంబాబు అనే తండ్రి క్యారక్టర్ అయితే ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. సినిమాలు చూసి నేర్చుకున్న తెలివితేటలతో తన కూతుళ్ళని భార్యని హత్య కేసు నుంచి బయటపడేసిన రాంబాబు క్యారక్టర్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మొత్తం దాసోహమయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో ఏ సినిమా సాధించని ఘన విజయాన్ని సాధించింది.
దృశ్యం 2013 లో మళయాళంలో తెరకెక్కిన మూవీ. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది.తాజాగా ఇప్పడు హాలీవుడ్ లో కూడా రీమేక్ అవ్వబోతుంది. కుమార్ మంగత్ పాఠక్, పనోరమా స్టూడియోస్ లు గల్ఫ్ స్ట్రీమ్ అండ్ జోట్ ఫిల్మ్స్ లు కలిసి హాలీవుడ్ లో రీమేక్ చెయ్యబోతున్నారు. దీంతో హాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా దృశ్యం నిలిచింది. ఇతర నటి నటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.అలాగే కొరియన్ భాషలో కూడా తెరకెక్కనుంది.
దృశ్యం చిత్రాన్ని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్తామని పనోరమా స్టూడియోస్ గత ఏడాది అనౌన్స్ చేసింది.ఇప్పుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని దృశ్యం లవర్స్ కి ఆనందాన్ని తీసుకొచ్చారు. తెలుగు దృశ్యంలో వెంకటేష్, మీనా, నదియా, ఇస్తర్ అనిల్, కృతిక జయకుమార్ లు నటించారు. ఒరిజినల్ మలయాళంలో మోహన్ లాల్, మీనా, ఇస్తర్ అనిల్, అన్పిబా ,ఆషా శరత్ తదితరులు నటించారు. జీతూ జోసెఫ్ రచనా దర్శకత్వాన్ని వహించాడు. తెలుగుకి శ్రీ ప్రియ దర్శకత్వం వహించింది.