ఐడీ కార్డు, బ్యాగ్ తో వచ్చి హాస్టల్లో చోరీగాజులరామారంలోని భవాని నగర్ కు చెందిన ఆపాల బాలాజీ (20) నగరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన బాలాజీ సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రైవేట్ హాస్టల్లో సెక్యూరిటీ తక్కువ ఉంటుందని గుర్తించి, మెడలో కళాశాల ఐడీ కార్డు, బ్యాగుతో హాస్టల్లో తన స్నేహితుడు ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్లేవాడు. తాళాలు పగలుగొట్టి గదుల్లో ల్యాప్ టాప్ లు చోరీ చేసేవాడు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ (20) అనే యువకుడు నగరానికి వలస వచ్చి హిమాయత్ నగర్ అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన పర్వీజ్ కుమార్ అనే వ్యక్తి సలహాతో క్యాష్పై యాప్ లో పికప్ ఏజెంట్ గా చేరాడు. ఇక అదే యాప్ లో పర్వేజ్ కుమార్ డీలర్ గా పని చేస్తున్నాడు. ఈ క్యాష్పై యాప్ లో బిల్లులు లేకుండానే ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించవచ్చు.
Source link
previous post
next post