Andhra Pradesh

హిందూపురం నుంచి దాదాప‌హాడ్ ద‌ర్గా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ స‌ర్వీస్‌లు-apsrtc running super luxury bus service hindupur to dada pahad weekly twice ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Hindupur To Dada Pahad APSRTC Buses : దేశంలోని పవిత్ర దర్గాల్లో గొప్పగా చెప్పుకునే దాదాపహాడ్ దర్గా యాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) బ‌స్ సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది. హిందూపురం నుంచి దాదాపహాడ్‌కు సూప‌ర్ ల‌గ్జరీ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను వేసింది. ఈ స‌ర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. ఇత‌ర ఆధ్యాత్మిక ప్రాంతాల ప‌ర్యట‌న స‌ర్వీసులానే ఈ బ‌స్సు స‌ర్వీస్‌లు కూడా రెండు ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుకు తీసుకెళ్తుంది. ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్రత్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్రయాణికులు, యాత్రికులు అత్యధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షత‌మైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ముస్లిం ప‌విత్ర సంద‌ర్శన ప్రాంతాలైన క‌ర్ణాట‌కలోని చిక్కమంగుళూరులో దాదాపహాడ్ దర్గా, బాన‌వారలోని స‌య్యద్ ఖ‌లంద‌ర్ షా బాబా ద‌ర్గాకు ఈ బస్సు స‌ర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.



Source link

Related posts

MP Vijayasai Reddy : పురందేశ్వరి గారు.. నాకైతే లిక్కర్ బ్రాండ్లు కూడా తెలియవు, ఆధారాలు ఉంటే బయటపెట్టండి

Oknews

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు, విచారణ వాయిదా-tdp chief chandrababu quash petition arguments in supreme court in skill case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

బాలకృష్ణలా పవన్ చేయొచ్చు కదా?

Oknews

Leave a Comment