Health Care

హిమాలయాలకు ముప్పు.. గ్లోబల్ వార్మింగ్‌తో 90 శాతం ప్రాంతాల్లో జరిగేది ఇదే..


దిశ, ఫీచర్స్ : గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో గత కొంతకాలంగా ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలు దీని కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. అక్కడ తరచుగా వాతావరణం వేడెక్కడం, అకాల వర్షాలు, వరదలు, భూ కంపాలు వంటివి సంభవిస్తున్నాయి. భారతదేశంపై ఇంకా పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కానీ భవిష్యత్తులో ఆ ప్రమాదం పొంచి ఉందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (UEA) పరిశోధనలో వెల్లడైంది.

కరువు ఏర్పడే చాన్స్ 

ఇప్పుడు ఉన్నదానికంటే 3 డిగ్రీల సెల్సియస్ గ్రేడ్ వరకు గ్లోబల్ వార్మింగ్ పెరిగితే గనుక భారత దేశంలో హిమాలయ పర్వత పరిసరాల్లోని 90 శాతం ప్రాంతాలు ఒక సంవత్సరంపాటు తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొనే చాన్స్ ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. అయితే దీనిని కనీసం1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే పారిస్ ఒప్పందంలోని ఉష్ణోగ్రత లక్ష్యాలను పాటించడం ద్వారా 80 శాతం వరకు ప్రతికూల వాతావరణ ప్రభావాన్ని నివారించవచ్చని కూడా సూచిస్తున్నారు.

జీవవైవిధ్యంపై ఎఫెక్ట్

క్రమంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ లెవల్స్ కారణంగా మానవులు, సహజ వనరులు, వ్యవస్థలపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. ఇందుకోసం ఇండియా, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా వంటి దేశాలపై ప్రధానంగా దృష్టి సారించిన ఎనిమిది అధ్యయనాల సమాహారాన్ని విశ్లేషించారు. ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆయా దేశాల్లో కరువు, వరదలు, పంట దిగుబడుల క్షీణత, జీవవైవిధ్యం, సహజ మూలధనం యొక్క నష్టాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

30 ఏళ్లలో ఏం జరగనుంది?

గ్లోబల్ వార్మింగ్ 3 నుంచి 4 డిగ్రీలు పెరిగితే భారతదేశంలో జీవ వైవిధ్యంలో పాలినేషన్(పరాగ సంపర్కం) సగానికి తగ్గుతుందని, 1.5 డిగ్రీలు పెరిగితే గనుక పావు వంతు తగ్గుతుందని రీసెర్చర్స్ అంచనా వేశారు. అయితే వాతావరణం వేడెక్కడాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం వల్ల దేశంలోని సగం జీవవైవిధ్యానికి మేలు జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా 3 డిగ్రీల సెల్సియస్ వార్మింగ్‌తో 30 సంవత్సరాల కాలంలో ప్రతి దేశంలోని 50 శాతానికి పైగా వ్యవసాయ భూమి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు తీవ్రమైన కరువుకు గురవుతుందని అంచనా వేయబడింది.

నివారణ చర్యలు అవసరం

గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం వల్ల వ్యవసాయ భూమి కరువుకు గురి అయ్యే చాన్స్ భారత దేశంలో 21 శాతం, ఇతియోపియాలో 61 శాతం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు అకాల వర్షాలు, వరదల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఫలితంగా ఆర్థిక నష్టాలను నివారించబడతాయి. అందుకే గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడానికి మరింత కృషి అవసరమని పరిశోధకులు పేర్కొంటున్నారు.



Source link

Related posts

ఫ్లైట్‌లో రొమాన్స్‌తో రెచ్చిపోయిన జంట.. చేతులతో వికృత చేష్టలు చేస్తూ.. (పోస్ట్ వైరల్)

Oknews

నిద్రలో పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

Oknews

ప్రామిస్ డే: ఇలా ప్రామిస్ చేసి మీ లవర్‌ను ఇంప్రెస్ చేయండి!

Oknews

Leave a Comment