ప్రపంచం మొత్తాన్ని ఏకతాటిపై నిలిపే శక్తీ ఒక్క సినిమాకే ఉంది. ఎన్ని దేశాలు ఉన్నా, ఎన్ని భాషలు ఉన్నా సరే సినిమా అనే మతం ముందు అవన్నీ దిగదుడుపే.అసలు సినిమా లేనిదే విశ్వం ఎప్పుడో శూన్యంలో కలిసిపోయేది అనే నానుడి కూడా ఉంది. మరి అలాంటి సినిమాకి తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపాటుకి గురి చేస్తుంది.
శాంటో ఖాన్( shanto khan)మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ కి చెందిన సినీ నటుడు. హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో చేసి మంచి ఇమేజ్ ని సంపాదించాడు. ఇప్పుడు ఆయన దారుణ హత్యకి గురయ్యాడు. బంగ్లాదేశ్ లో ప్రతిభ ఆధారంగా ఉధ్యోగాలు కల్పించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరకి తెలిసిందే. అది హింసకి దారిమళ్లడంతో ఎంతో మంది చనిపోతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది విద్యార్థులు చాంద్ పూర్ జిల్లా బగారాబజార్ లో ఉంటున్న శాంటో ఖాన్ ఇంటికి వచ్చారు. ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే శాంటో ఖాన్ వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు.
దీంతో విద్యార్థులందరు ఒక్కసారిగా కర్రలతో ఖాన్ మీద దాడి చేసి అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు.ఈ దాడిలో ఖాన్ తండ్రి సెలిమ్(selim khan) ఖాన్ కూడా చనిపోయాడు. ఆయన కూడా నిర్మాతగా చాలా సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు ఈ సంఘటన పలువురిని కలిచి వేస్తుంది.