Entertainment

హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!


తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో కొందరు పోలీస్ అధికారులు చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అప్పటి విపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేసి కీలక సమాచారాలు సేకరించడంతో పాటు.. ఎందరో సినీ ప్రముఖుల మరియు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి, వారి వ్యక్తిగత విషయాలు సేకరించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది. సమంతతో పాటు ఎందరో హీరోయిన్ల ఫోన్లు అప్పుడు ట్యాప్ అయ్యాయని వార్తలొస్తున్నాయి. దీని వెనుక అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఉన్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వివాదంపై తాజాగా స్పదించిన కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ చెప్పారు. హీరోయిన్లను బెదిరించారని కొందరు ఆరోపిస్తున్నారు.. అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మ నాకు పట్టలేదని అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే తాటతీస్తానని బెదిరించిన కేటీఆర్.. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.



Source link

Related posts

దుల్కర్‌ సల్మాన్‌ ఆ సినిమాకి ప్లస్‌ అవుతాడా?

Oknews

అల్లు అర్జున్ యాక్టింగ్ బీస్ట్ అంటున్న సమంత 

Oknews

బాలీవుడ్ ఫిల్మ్ సైన్ చేసిన రామ్ చరణ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్..!

Oknews

Leave a Comment