Entertainment

హీరోయిన్ అనిత ప్రెగ్నెన్సీ ఫోటోలు – Anita Hassanandani Revealed Her Pregnancy Photos


గర్భం దాల్చిన హీరోయిన్... వైరల్ ఫోటోలు

నువ్వునేను, శ్రీరామ్ వంటి సినిమాలతో ఉదయ్ కిరణ్‌తో జంటగా నటించి అలరించిన హీరోయిన్ అనిత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ భామ ఇప్పుడు గర్భవతి అయ్యింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన అనితకు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో హీందీ సిరియల్స్‌లో నటించి అందర్నీ అలరించింది. ఆ తర్వాత ప్రముఖ వ్యాపార వేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది.

అయితే ఇప్పుడు మ్యాటరేంటి అంటే ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో వాటిని ఖాయం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
నిండు గర్భంతో ఉన్న అనిత ఫోటోలకు ఫోజులిచ్చింది. తాను గర్భవతినంటూ.. త్వరలో కవలలకు జన్మనిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పుడు అనిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ ఫొటోలను షేర్‌చేసిన అనిత ‘నేను ఫేక్ బేబీ బంప్‌తో ఫొటో షేర్ చేశాను. ఇక రియల్ బేబీ బంప్‌తో పాటు ఫొటో షేర్‌చేస్తే ఎలావుంటుందో మరి’ అని కామెంట్ రాశారు. కాగా ఇటీవల అనిత భర్త రోహిత్‌రెడ్డి ఒక వీడియోను షేర్‌చేస్తూ అనిత ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిని అనిత ప్రెగ్నెన్సీ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

 



Source link

Related posts

మార్చి 15న విడుదల కానున్న అందమైన ప్రేమకథ ‘లంబసింగి’..

Oknews

XXX .. వెంకీ మామ సినిమాకి సంస్కారవంతమైన టైటిల్!

Oknews

క్రిస్టోఫర్ నోలన్ మాస్.. ఆస్కార్స్ లో సత్తా చాటిన 'ఓపెన్‌హైమర్'.. ఏకంగా 7 అవార్డులు!

Oknews

Leave a Comment