EntertainmentLatest News

హీరోయిన్‌ సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌.. సస్పెన్స్‌లో వరుడు?


సెలబ్రిటీస్‌ పెళ్ళి అంటే చాలు అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. అందులోనూ హీరోయిన్‌ పెళ్లి అనగానే అబ్బాయి ఎవరు? పెళ్ళెప్పుడు? అని సెర్చ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా ఫామ్‌లో వున్న హీరోయిన్‌ పెళ్ళి చేసుకుంటే కుర్రకారు సరిపెట్టుకోవడం కష్టమైన పనే. అలాగే ఆ తర్వాత ఆ హీరోయిన్‌గా ఆమె నిలదొక్కుకోవడం కూడా కష్టమే. అయితే ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆ హీరోయిన్‌కి ఆ బాధ లేదు. ఎందుకంటే సినిమాలకు గుడ్‌బై చెప్పి చాలా కాలమైంది. సాధారణంగా సినిమాలు చేస్తూనే బిజినెస్‌ రంగంవైపు అడుగులు వేయడం మనం చూస్తుంటాం. కానీ, ఈ హీరోయిన్‌ తన లక్‌ ఎలా వుందో కొన్ని సినిమాలతోనే తెలుసుకుంది. దాంతో మనకు ఈ రంగం అచ్చి రాదనుకుందో ఏమో, బిజినెస్‌లోకి దిగిపోయింది. ఆ హీరోయిన్‌ ఎవరంటే ఒకప్పటి టాప్‌ హీరోయిన్‌ రాధ కూతురు కార్తీక. తెలుగులో నాగచైతన్య చేసిన మొదటి సినిమా ‘జోష్‌’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమా ‘రంగం’. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత ఆదరణ లభించలేదు. 

అందుకే దుబాయ్‌లో హోటల్స్‌ బిజినెస్‌ చేస్తోంది. అందులోనే రాణిస్తూ పలు అవార్డులు కూడా గెలుచుకుంది. బిజినెస్‌లో సక్సెస్‌ సాధించిన కార్తీక ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతోంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఓ అబ్బాయిని హగ్‌ చేసుకొని.. చేతికి ఉన్న కొత్త రింగ్‌ని చూపిస్తూ కార్తీక ఫోటో పోస్ట్‌ చేసింది. ఆ ఫోటోలో కార్తీక రింగ్‌ చూపిస్తూ నవ్వుతున్నప్పటికి.. ఆ అబ్బాయి ఎవరనేది రివీల్‌ చేయలేదు. ఈ ఫోటో చూసిన తర్వాత ఇండస్ట్రీ వర్గాలు, నెటిజన్లు ఆమెకు విషెస్‌ తెలియజేస్తున్నారు. అయితే హీరోయిన్‌గా ఇప్పుడు ఆమె ఫామ్‌లో లేదు, నిజానికి అసలు ఫీల్డ్‌లోనే లేదు. అలాంటప్పుడు వరుడు ఎవరు అనేది సస్పెన్స్‌లో పెట్టాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె పెళ్ళి చేసుకున్నా, చేసుకోకపోయినా ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు అంటున్నారు. 



Source link

Related posts

mahesh given warning to vijayashanthi

Oknews

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ పిక్

Oknews

Rashmi Jabardasth Glamour Look రష్మీ జబర్దస్త్ గ్లామర్ లుక్

Oknews

Leave a Comment