EntertainmentLatest News

హీరో అజిత్‌కు ప్రమాదం.. డూప్‌ లేకుండా చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ వీడియో వైరల్‌!


తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ఎలాంటి యాక్షన్స్‌ సీన్స్‌ అయినా డూప్‌ లేకుండా చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. స్వతహాగా కార్‌ రేసర్‌ అయిన అజిత్‌.. బైక్‌ కూడా అంతే నైపుణ్యంతో డ్రైవ్‌ చెయ్యగలడు. చాలా సినిమాల్లో అలాంటి సన్నివేశాలు చెయ్యాల్సి వచ్చినపుడు డూప్‌ సహాయం లేకుండా నేచురల్‌గానే చేసేవారు. అలా చాలాసార్లు గాయాలపాలయ్యాడు అజిత్‌. ప్రస్తుతం ‘విడాముయర్చి’ అనే చిత్రం చేస్తున్నాడు. మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండగా, లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 

గత ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. అక్టోబర్‌లో అజర్‌ బైజాన్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ చేశారు. నవంబర్‌లో తీసిన ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌లో అజిత్‌ గాయపడ్డాడు. ఈ వార్త అప్పట్లో మీడియాలో బాగా వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అజిత్‌ కారును డ్రైవ్‌ చేస్తుండగా అతని పక్కన నటుడు అరవ్‌ కూడా ఉన్నాడు. అతని చేతికి బేడీలు ఉండడమే కాకుండా, అతన్ని సీటుకు కట్టేసారు. వేగంగా కారును డ్రైవ్‌ చేస్తూ ఉండగా సడన్‌గా అదుపు తప్పి కారు తలక్రిందులు అయిపోయింది. కారు పల్టీ కొట్టి పడిపోయిన తర్వాత ‘నువ్వు బాగానే ఉన్నావ్‌ కదా’ అంటూ అజిత్‌ అతన్ని అడిగిన మాటలు వినిపించాయి. దూరంగా ఉన్న యూనిట్‌ సభ్యులు పరుగు పరుగున వచ్చి ఇద్దరినీ కారులో నుంచి బయటికి తీశారు. ఈ షాట్‌ చిత్రీకరణలో డ్రోన్‌ కెమెరాను ఉపయోగించారు. అలాగే కారు డాష్‌ బోర్డులో కూడా ఒక కెమెరా ఉంది. సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం ఎంతటి రిస్క్‌ చేయడానికైనా వెనుకాడని అజిత్‌ కమిట్‌మెంట్‌ని నెటిజన్లు, ఫ్యాన్స్‌ అప్రిషియేట్‌ చేస్తున్నారు. సినిమా కోసం ప్రాణాలు ఫణంగా పెట్టే నీకు సెల్యూట్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.



Source link

Related posts

Big B apologises to Prabhas fans ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ బి క్షమాపణలు

Oknews

Nivetha Rubbishes Allegations On Her Lavish Lifestyle రూమర్స్ పై నివేదా పేతురాజ్ ఫైర్

Oknews

Game Changer release date update గేమ్ ఛేంజర్ డేట్ పై సస్పెన్స్ వీడదా..

Oknews

Leave a Comment