కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ 2’ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్టంట్ మ్యాన్ ఏలుమలై మృతి చెందారు. మూడు రోజుల క్రితమే ‘సర్దార్ 2’ షూటింగ్ స్టార్ట్ అయింది. చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్రీకరణ జరుగుతోంది. జూలై 16న యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలో స్టంట్ మ్యాన్ ఏలుమలై ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుండి కిందపడ్డారు. తీవ్ర గాయాల పాలైన స్టంట్ మ్యాన్ ను వెంటనే మూవీ టీం దగ్గరలోని హాస్పిటల్ కి తరలించింది. చికిత్స పొందుతూ జూలై 16 రాత్రి ఏలుమలై కన్నుమూశారు. ఏలుమలై మృతికి సంతాపం తెలిపిన మేకర్స్.. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అలాగే, స్టంట్ మ్యాన్ మృతి తో సినిమా షూటింగ్ ను వాయిదా వేశారు మేకర్స్.