తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో నాని(nani)నాచురల్ నటనతో ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకొని నాచురల్ స్టార్ గా ఎదిగాడు. అంటే సుందరానికి , దసరా, హాయ్ నాన్న తో హ్యాట్రిక్ ని అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా సరిపోదా శనివారం (saripoda sanivaram)తో రాబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
గండర గండడు అనే లిరిక్ తో సాంగ్ స్టార్ట్ అయ్యి గరం గరంగా ఉంది. సాంగ్ మొత్తం వింటుంటే మూవీలో నాని క్యారక్టర్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తుంది. నాని కూడా పాట మధ్యలో వచ్చే కొన్ని హిందీ పదాలని పాడాడు. మార్ డాలా అని అనడం చాలా బాగుంది. బహుశా నాని కెరీర్ లో ఇంత వరకు హీరో పాత్రని ఈ విధంగా ఎలివేట్ చెయ్యలేదు. సాన పాటి భరద్వాజ్ పాత్రుడు రచనా సారధ్యంలో రాగా విశాల్ బద్లాని ఆలపించాడు. ఆయన గొంతుతో పాటకి మరింత హుషారు వచ్చింది. ఫ్యాన్స్ ఐతే అప్పుడే సాంగ్ కి రీల్స్ చెయ్యడం కూడా ప్రారంభించారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అంటే సుందరానికి కూడా వివేక్ నే దర్శకుడు.దీంతో సరిపోదా శనివారం మీద అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుండగా ఎస్ జె సూర్య విలన్ గా చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య నాని కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఆగస్ట్ 29న విడుదల అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి.