పరాజయాలు చుట్టుముడుతున్నా ప్రేక్షకులని నమ్ముకొని సినిమాలు చేసుకుంటు వెళ్లే హీరోల్లో నిఖిల్ కూడా ఒకడు. ఆ నమ్మకమే నిఖిల్ ని ఈ రోజు పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. కార్తికేయ 2 లో అత్యద్భుతంగా నటించి ఆ ఘనతని సాధించాడు. లేటెస్ట్ గా ఆయనకి సంబంధించిన న్యూస్ ఒకటి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.
నిఖిల్ భార్య పల్లవి కొంచంసేపటి క్రితమే డెలివరీ అయ్యింది. పండంటి మగ బిడ్డకి ఆమె జన్మినిచ్చింది.ఈ విషయాన్ని నిఖిల్ టీం ఆఫ్ తెలంగాణ తమ ఇనిస్టాగ్రమ్ ద్వారా వెల్లడి చేసింది. ఈ వార్తతో అభిమానులు మా హీరోకి వారసుడు వచ్చాడంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇండస్ట్రీ కి చెందిన వారందరు కూడా నిఖిల్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.
నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే మూవీ చేస్తున్నాడు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఆ మూవీలో యుద్ధ వీరుడుగా నటిస్తున్నాడు. తన క్యారక్టర్ బాగా రావాలని అందుకు సంబంధించిన విన్యాసాలన్నిటిని కూడా నేర్చుకున్నాడు. హ్యాపీ డేస్, యువత, కార్తికేయ, స్వామి రారా లాంటి విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం వారసుడు వచ్చిన సంతోషంలో నిఖిల్ మరింత ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటాడు.