తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మంచి నటుల్లో నితిన్ కూడా ఒకడు. రెండు దశాబ్దాలపై నుంచి తెలుగు సినిమా మీద తనదైన ముద్ర వేస్తు ముందుకు దూసుకుపోతున్నాడు. ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ తో పరాజయాన్ని అందుకున్న నితిన్ కి సంబంధించిన తాజా న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తుంది.
నితిన్ చేస్తున్న నయా మూవీల్లో వెంకీ కుడుమల మూవీ కూడా ఒకటి.రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా కాసేపటి క్రితమే ఆ మూవీ టైటిల్ తో పాటు టీజర్ రిలీజ్ అయ్యింది. అంతర్జాతీయ దొంగ రాబిన్ హుడ్ అనే టైటిల్ ని పెట్టడం జరిగింది. అలాగే ఇంచుమించు నిమిషంన్నర వ్యవధిలో ఉన్న గ్లింప్స్ వీడియో అయితే ఒక రేంజ్ లో ఉంది. డబ్బు చాలా చెడ్డది రూపాయి రూపాయి నువ్ ఏం చేస్తావ్ అంటే అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటుంది అన్నట్టుగానే చేసిందనే నితిన్ వాయిస్ తో ఆ వీడియో స్టార్ అయ్యింది. నితిన్ ని రివీల్ చేసిన విధానం కూడా చాలా వెరైటీ గా ఉంది. ఒక స్టైలిస్ట్ బైక్ మీద శాంతా క్లాజ్ గెటప్ లో కనపడ్డాడు. పైగా నితిన్ దగ్గరనున్న బాగ్ లో డబ్బు బంగారం కూడా ఉన్నాయి. అలాగే బైక్ ముందుభాగంలో నేను భారతీయుడిని అని రాసి ఉండగా వెనుకభాగంలో నేను చాలా రేర్ అని రాసి ఉంది.
ఆ తర్వాత దేశం అంత కుటుంబం నాది ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు ఆభరణాలేసుకున్నోళ్లంతా నావారు. అవసరం కొద్దీ వాళ్ళ జేబుల్లో చెయ్యి పెడితే ఫ్యామిలీ నెంబర్ అని చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. ఐనా నేను హర్ట్ అవ్వలేదు. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం నా ప్రాథమిక హక్కు. ఎందుకంటే భారతీయులందరు నా సోదరులు సోదరీమణులు అంటూ చెప్పిన డైలాగ్స్ కూడా బాగా పేలాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ గా ఉంది.అలాగే చివరలో నితిన్ డబ్బుని బంగారాన్ని దాచిపెట్టిన ప్లేస్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది.మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మాణం అవుతున్న ఈ రాబిన్ హుడ్ కి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.