Durgamma Nimajjanam : హైదరాబాద్ లో నేటి( సోమవారం) నుంచి ఈనెల 26 వరకు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాల కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, బేబీ పాండ్స్, సంజీవయ్య పార్క్ వద్ద నిమజ్జనాలు జరుగనున్నట్లు సుధీర్ బాబు ప్రకటించారు. ఈ మేరకు వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రాంతాల్లో ప్రయాణించాలని, మళ్లింపు పాయింట్లను గమనించుకోవాలని కోరారు.