Health Care

హైవేలపై సైన్ బోర్డులు గమనించారా?.. గ్రీన్ కలర్‌లోనే ఉండటానికి కారణం ఇదే..


దిశ, ఫీచర్స్ : సాధారణంగా రోడ్లపై రెడ్ లేదా వైట్ కలర్ సైన్ బోర్డులు కనిపిస్తుంటాయి. ఇవి డైవర్షన్, స్పీడ్ లిమిట్, క్రాసింగ్ వంటి సూచనలు చేస్తాయి. కానీ నేషనల్ హైవేపై జర్నీ చేస్తున్నప్పుడు గమనిస్తే గనుక కేవలం గ్రీన్ కలర్ సైన్ బోర్డులు మాత్రమే దర్శనమిస్తాయి. ఇవి ఆయా పట్టణాలు, నగరాల మధ్య డిస్టెన్స్‌ను, సేఫ్టీ అడ్వైస్‌ను సూచిస్తుంటాయి. అయితే ఇక్కడి సైన్ బోర్డులు గ్రీన్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

* హైవేలపై కూడా రెడ్ కలర్ సైన్ బోర్డులు పెట్టొచ్చు కదా అనుకుంటాం. కానీ.. అలా పెట్టకపోవడానికి కారణం ఉందట. ఏంటంటే.. ట్రావెలింగ్ స్పీడ్ కారణంగా రెడ్ కలర్ సైన్ బోర్డులు అంతగా కనిపించవు. పైగా వీటిని ప్రమాద సంకేతంగా భావిస్తారు. నేషల్ హైవేపై ఈ కలర్ బోర్డులు ఉంటే ట్రావెలర్స్ మూడ్ చేంజ్ అయ్యి అటెన్షన్ డైవర్ట్ అయ్యే చాన్స్ ఉంటుంది. అలాగే హైవేపై వెహికల్ స్పీడ్ సహజంగానే ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రైవర్ ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద ప్రమాదం జరగవచ్చు. అందుకే ఏకాగ్రతను డైవర్ట్ చేసే రెడ్ కలర్ సైన్ బోర్డులు హైవేలపై ఏర్పాటు చేయరు. బదులుగా గ్రీన్ కలర్ బోర్డులు ఏర్పాటు చేస్తారు.

* గ్రీన్ కలర్ బోర్డులు హైవేలపై ఏర్పాటు చేయడంవల్ల మరో ప్రయోజనం ఏంటంటే.. అవి ఎక్కువ దూరం వరకు కనిపిస్తాయట. అంతే కాకుండా ఆకుపచ్చ రంగు ప్రశాంతతకు చిహ్నం కాబట్టి ట్రావెలర్లు, డ్రైవర్ల అటెన్షన్‌ను డైవర్ట్ చేయదు. మానసిక నిపుణుల ప్రకారం.. గ్రీన్ కలర్ కళ్లకు హాయినిస్తుంది. దీనిని చూడగానే డ్రైవర్‌ గానీ, ప్రయాణికులు గానీ గందరగోళానికి గురయ్యే చాన్స్ ఉండదు. ప్రమాదాలు జరిగే రిస్క్ తగ్గుతుంది. కాబట్టి నేషనల్ హైవేలపై గ్రీన్ కలర్ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు.



Source link

Related posts

Summer Health tips : వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి

Oknews

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ 4 తప్పులు అస్సలే చేయకూడదు!

Oknews

బోనాల పండుగ వెనుకున్న రహస్యాలు ఇవే.. పండుగను ఎందుకు జరుపుతారో తెలుసా?

Oknews

Leave a Comment