Health Care

హోలీకి ఉపయోగించే రంగుల్లో..ఏ కలర్ దేనికి ప్రతీకనో తెలుసా?


దిశ, ఫీచర్స్ : హోలీ అంటే చాలా మందికి ఇష్టం. రంగులతో సంబురంగా ఆడుకునే ఆటలో ఇదొక్కటి. చాలా మంది ఈ ఫెస్టివల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.అయితే హోలీని రంగులతో జరుపుకోవడం అనేది చాలా కామన్. కానీ మనం చల్లుకునే ఆ రంగులు దేనికి ప్రతీకో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఒక్కో రంగుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.అందువలన ఏ రంగు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చ రంగు : ఆకుపచ్చ రంగుతో హోలీ ఆడుతుంటారు. అయితే ఇది ఆనందానికి ప్రతీక.

ఎరుపు రంగు : హిందూ మతంలో ఎరుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దేవతలకు చాలా ఇష్టమైన రంగు ఎరుపు.ఈ రంగు శక్తి, ధైర్యం, ధార్మికం, పరాక్రమానికి సూచికగా భావిస్తారు. అందువలన ఎరుపు రంగుతో హోలీ ఆడటం చాలా మంచిదంట.

కాషాయం : హిందూమతంలో అత్యంత పవిత్రమైన రంగుల్లో కాషాయం రంగు ఒకటి. ఇది శ్రీరాముని రక్షణ, క్షేమాన్ని సూచిస్తుందంట. ఈ రంగు చాలా మంచిది.

నీలం రంగు : ఆకాశం, సముద్రం, నదులు, సరస్సులో నీలి రంగులోనే కనిపిస్తాయి. ధైర్యం, పౌరుషం, ధృఢ సంకల్పం, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోగల సామర్థ్యం, స్థిరమైన మనసు వంటి లక్షణాలను నీలం రంగు సూచిస్తుంది.

గులాబీ రంగు : అమ్మాయిలు ఎంతో ఎక్కువగా ఇష్టపడే రంగులలో గులాబీ రంగు ఒకటి. హోలీ వేడుకల్లో ఎక్కువగా వినియోగించే రంగు కూడా ఇదే. ఈ కలర్ యవ్వనం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. హోలీ వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకునే కళను ఇస్తుంది.



Source link

Related posts

రాత్రిపూట మెరిసే పుట్టగొడుగుల్ని చూశారా?.. మన దేశంలో ఆ ఒక్కచోటే కనిపిస్తాయ్..

Oknews

లవర్స్ డే స్పెషల్.. మీ ప్రియురాలు ఎక్కడ ఉన్నా ఇంట్లో నుంచే తనివితీరా ముద్దు పెట్టవచ్చు

Oknews

ఈ అలవాట్లతో విజయం మీ సొంతం..

Oknews

Leave a Comment