పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చేస్తున్న మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే. పవన్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ కు కొంతకాలంగా బ్రేక్ పడింది. ఓ పక్క రాజకీయాలు చూసుకుంటూనే తన సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రముఖ యాంకర్, నటి అనసూయ.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ సినిమాలో నటించిందని తెలుస్తోంది. అంతకుముందు అత్తారింటికి దారేది చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల మిస్ అయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్ సినిమాలో నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ సినిమాలో నటించానని, ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నానని ప్రకటించింది అనసూయ. అయితే ఆమె ఏ సినిమాలో నటించింది అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. పవన్‌కళ్యాణ్ సినిమాలో నటించాలన్న ఆమె కోరిక మొత్తానికి తీరిందన్నమాట.