సినిమా..సినిమా..సినిమా..ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఆ దేశాల్లో ఎన్ని భాషలు రన్ అవుతు ఉన్నాయో వాటన్నింటిలోను మాగ్జిమమ్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. వీళ్లందరి లక్ష్యం ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డు గా భావించే ఆస్కార్ అవార్డు. ఈ అవార్డు పొందితే చాలు తమ సినిమా జీవితం ధన్యమయినట్టే అని 24 క్రాఫ్ట్స్ కి చెందిన వారు భావిస్తారు. మరి సినిమాని ప్రపంచ సినిమాగా మార్చిన ఆస్కార్ కి ఈ సారి మన ఇండియా నుంచి ఏ ఏ సినిమాలు నామినేట్ అయ్యాయో చూద్దాం.
ముందుగా మన తెలుగు నుంచి చూసుకుంటే నాచురల్ స్టార్ నాని హీరోగా గత సంవత్సరం మార్చ్ 20 న వచ్చిన దసరా మూవీ ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. మన తెలుగు నుంచి ఇప్పటివరకు నామినేట్ అయ్యిన మూవీ దసరానే కావటం గమనార్హం.ఇంకేమైనా సినిమాలు నామినేట్ అవుతాయో చూడాలి. దసరాలో తన క్యారక్టర్ కోసం నాని పడిన కష్టం మొత్తం సిల్వర్ స్క్రీన్ మీద కనపడుతుంది. ఇక హిందీలో చూసుకుంటే ది స్టోరీ టెల్లర్, సంగీత పాఠశాల,శ్రీమతి ఛటర్జీ vs నార్వే, డంకీ, 12 th ఫెయిల్, జూమర్, రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, కేరళ కథ, గదర్ 2 ,ఆబ్ తో సబ్ భగవాన్ భరోసా లాంటి చిత్రాలు ఉన్నాయి.
తమిళం నుంచి విడుతలై పార్ట్ 1 , మలయాళం నుంచి 2018 ,మరాఠీ నుంచి బాప్ లియోక్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్థుతానికి మన ఇండియా నుంచి ఇప్పటివరకు ఆస్కార్ కి నామినేట్ చెయ్యబడిన సినిమాలు అయితే అవే. 2023 లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ని దక్కించుకొని ఇండియన్ సినిమా కీర్తితో పాటు తెలుగు సినిమా కీర్తిని విశ్వ వేదికపై నిలిపినట్టుగా ఈ సారి కూడా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి.