Entertainment

24 గంటల్లో పుష్ప 2 సంచలనం..ఫ్యాన్స్ వెయిటింగ్ 


అల్లు అర్జున్ (allu arjun)ఉరఫ్ బన్నీని ఐకాన్ స్టార్ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్ధం అయ్యింది. ఇదేం రికార్డు అండి బాబు.  బన్నీ సృష్టించిన ఒక  సరికొత్త రికార్డుతో ఆల్ రికార్డ్స్ చెల్లాచెదురు అయిపోయాయి. తగ్గేదేలే అంటు డైలాగ్ చెప్తుంటే ఏదో ఒక మాదిరిగా అనుకున్నాం కానీ ఈ లెవల్లో అని అనుకోలేదు.

 బన్నీ  బర్త్ డే సందర్భంగా  పుష్ప 2(pushpa 2) నుంచి మొన్న చిన్నపాటి టీజర్ ఒకటి రిలీజ్ అయ్యింది. గంగమ్మ జాతరలో  నిండుగా చీర ధరించి,కళ్లకి కాటుక పూసుకొని,  కాళ్ళకి  గజ్జెలు  కట్టుకొని, చేతిలో త్రిశూలాన్ని ధరించిన బన్నీ లుక్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ టీజర్ కేవలం 24 గంటల్లో 85 మిలియన్ల వ్యూస్ ని సంపాదించింది. అలాగే 1 .2  మిలియన్ల లైక్స్ ని కూడా  దక్కించుకుంది. దీంతో బన్నీ స్టామినా ఏంటో  అందరకి అర్ధం అయ్యింది.టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సిల్వర్ స్క్రీన్ పై మరోసారి బన్నీ మ్యాజిక్  పక్కా అని  అంటున్నారు. పైగా నేషనల్ అవార్డు గెలుచుకున్న తర్వాత బన్నీ నుంచి వస్తున్నఫస్ట్ మూవీ కావడంతో అంచనాలు పీక్ లో ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే అగస్ట్ 15 కోసం ఫుల్ వెయిటింగ్

ఇక దర్శకుడు సుకుమార్ (sukumar) పుష్ప 2 ని  అ గష్టు 15 కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి  డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా విరామం అనేది లేకుండా  కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రష్మిక మందన్న ,ఫాహద్ ఫాజిల్ ,అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.పార్ట్ 1 హిట్ కావడంతో 2 పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి.

 



Source link

Related posts

దుల్కర్‌ సల్మాన్‌ ఆ సినిమాకి ప్లస్‌ అవుతాడా?

Oknews

చెన్నైకి ఇప్పుడప్పుడే వెళ్ళదంట..సూర్య, శివకుమార్ లకి గొడవ జరిగిందా! 

Oknews

రవితేజ కాదు.. మరో మాస్ హీరోతో ‘జాతిరత్నాలు’ దర్శకుడి మూవీ!

Oknews

Leave a Comment