Entertainment

300 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్న ప్రభుదేవా సినిమా..ఇక థియేటర్స్ లో డాన్సులే


మూవీ లవర్స్ కి  గుడ్ న్యూస్. ప్రేమికులకి  అయితే ఇక పండగే. ఎందుకంటే ఒక సూపర్ లవ్ మూవీ విడుదల కాబోతుంది. పైగా అది అలాంటి ఇలాంటి మూవీ కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త నిర్వచనాన్ని చెప్పింది.మరి ఆ మూవీ ఏంటో చూద్దామా!

1994 లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ప్రేమికుడు. ప్రభుదేవా, నగ్మా హీరో, హీరోయిన్ లుగా చేసారు. ఇప్పుడు ఈ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. మే 1 న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి 300 స్క్రీన్స్ లో  ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో  ఈ న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది. ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ ప్రేమికుడుకి  దర్శకత్వం వహించాడు. ప్రభుదేవాకి హీరోగా రెండవ చిత్రం.  చాలా ఏరియాల్లో  100 డేస్ ని కూడా  జరుపుకుంది. ఈ రోజుకి మూవీలోని పాటలు తెలుగు నాట మారుమోగిపోతుంటాయి.ఇక ప్రభుదేవా డాన్స్ కి అయితే థియేటర్స్ లో ఒకటే ఈలలు. ముఖ్యంగా ముక్కాల పాటకి అయితే సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరు.

గ్రాఫిక్స్  పెద్దగా ప్రాచుర్యం లేని రోజుల్లోనే ఆ పాటని చిత్రీకరించి అందర్నీ మెల్బోర్న్ చేసారు.ప్రముఖ కామెడీ నటుడు  వడివేలు కామెడీ కూడా సూపర్ గా ఉంటుంది. ప్రముఖ గాయకులు, నటులు అయినటువంటి  దివంగత  బాలసుబ్రమణ్యం గారు ప్రభుదేవా కి తండ్రిగా చాలా అద్భుతంగా  నటించారు.వర్సటైల్ యాక్టర్ గిరీష్ కర్నాడ్ ముఖ్య పాత్రలో నటించాడు ఒక పేద యవకుడు ఒక గొప్పింటి అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ కి రాజకీయాన్ని జోడించి సినిమాని తెరకెక్కించారు.కేటీ కుంజుమోహన్ నిర్మాతగా వ్యహరించాడు. తమిళంలో కాదలన్ పేరుతో  విడుదల అయ్యింది.ఇక  అప్పట్లో కుర్రకారుని ఒక ఊపిన ప్రేమికుడు ఇప్పటి కుర్రకారుని కూడా ఒక ఊపు ఊపడం ఖాయం.


 



Source link

Related posts

ఓటిటి లో హనుమాన్ 200 మిలియన్

Oknews

Squid Game2 : ఓటీటీలోకి స్క్విడ్ గేమ్2 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

ఓటీటీలోకి 'హరోం హర'.. యాక్షన్ ప్రియులకి పండగే!

Oknews

Leave a Comment