Entertainment

33 ఏళ్ళ తర్వాత ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌!


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘జైలర్‌’ కలెక్షన్ల పరంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత రెట్టించిన ఉత్సాహంతో రజనీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రజనీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్‌ టాపిక్‌గా మారింది. ‘జై భీమ్‌’ వంటి ఉత్తమ చిత్రాన్ని తెరకెక్కించిన టిజి జ్ఞానవేల్‌ ఈ సినిమాకి దర్శకుడు. రజనీ 170వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

పాన్‌ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. హిందీ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, తెలుగు నుంచి రానా దగ్గుబాటి, మలయాళం నుంచి ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఇప్పటికే మంజు వారియర్‌, రితిక సింగ్‌, దుషారా విజయన్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. 

ఇక్కడ ఓ విశేషం ఉంది. అదేమిటంటే 1990లో విడుదలైన బాలీవుడ్‌ మూబీ ‘హమ్‌’ అనే చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ అమితాబ్‌, రజనీ కలిసి నంటించింది లేదు. ఇప్పుడు రజనీ 170లో మళ్ళీ అమితాబ్‌, రజనీ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. అంటే 33 ఏళ్ళ తర్వాత ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయడం అనేది విశేషమే. ఈ సినిమాకి సంబంధించి ఒక ఫోటోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అమితాబ్‌ కూర్చొని ఫోన్‌ చూస్తుండగా పక్కన ఆయన్ని పట్టుకొని ఉన్న రజనీ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు సూపర్‌స్టార్స్‌ ఒకే ఫ్రేమ్‌లో అదరగొడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 



Source link

Related posts

రామాయణ గాథను నిజాయితీగా తెరకెక్కిస్తాం.. నిర్మాతల్లో ఒకరైన యశ్‌ క్లారిటీ!

Oknews

శ్రీదేవి కూతురు జాన్వీ  వీడియో వైరల్.. సినిమాలకి సంబంధం లేదు..నాలుక మడత బెట్టి  

Oknews

అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సినిమా.. ఊహించని ట్విస్ట్!

Oknews

Leave a Comment