దిశ, ఫీచర్స్ : యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఉండే ఉల్లాసం, ఉత్సాహమే వేరు. ప్రతి ఒక్కరూ ఆ వయస్సును ఎంజాయ్ చేయాల్సిందే. పైగా ఏ వయస్సులో చేయాల్సిన పనులు ఆ వయస్సులో చేస్తేనే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. కానీ కొందరు 40 ఏళ్లు దాటాక కూడా ఆగలేకపోతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా చేయకూడని పనులు చేస్తుంటారు. దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఉందని ఫిట్ నెస్ నిపుణులు చెప్తున్నారు. జిమ్‌లో వ్యాయామాలకు సంబంధించి అలా చేయకూడని పనులేవో చూద్దాం.
* వయస్సు పెరిగే కొద్దీ పలు వ్యాయామాలు ఆరోగ్యంపై హానికర ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా కార్డియో వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ 40 ఏళ్లు దాటాక తీవ్రమైన కార్డియో వ్యాయామాలు అస్సలు మంచివి కాదు. ఎందుకంటే ఈ ఏజ్ తర్వాత కండరాలు బలహీనంగా మారుతుంటాయి. బలమైన వ్యాయామం శరీరాన్ని డామినేట్ చేస్తుంది. దీనివల్ల ఇతర అనారోగ్యాలు సంభవిస్తాయి.
* క్రంచెస్, ఇతర ఎ,బి ఎక్సర్‌సైజెస్ శరీరాన్ని ఆకృతి చేయడంలో, అన్‌వాంటెడ్ ఫ్యాట్ తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. కానీ నిర్ణీత వయస్సుకు మించి ఈ వ్యాయామం చేయడంవల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రావచ్చు. క్రంచెస్ చేసిన తర్వాత చాలా మంది వెన్ను, నొప్పితో బాధపడుతుంటారు. కాబట్టి ఏజ్‌ని బట్టి ఏ వ్యాయామం చేయాలో తెలుసుకోవడం బెటర్.
*వయసు పెరిగేకొద్దీ శరీరం బలహీనంగా మారుతుంది. కాబట్టి కాళ్లతో అధిక బరువులు ఎత్తేటప్పుడు, చీలమండలు, మోకాళ్లకు గాయాలు అయ్యే చాన్స్ ఉంటుంది. కాబట్టి కాళ్లపై ప్రభావం చూపే బరువులు ఎత్తడం, వ్యాయామాలు చేయడం నలభై ఏళ్లు దాటిన తర్వాత చేయకూడదు. అలా చేయకూడని వ్యాయామాల విషయానికి స్క్వాట్స్ కూడా ఉన్నాయి. జిమ్‌లో అందరూ కామన్‌గా చేయగలిగే వర్కువుట్లలో ఇది కూడా ఒకటి. సులభమైనదే కానీ 40 ఏళ్లు దాటాక చేయడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.