Health Care

5 కోట్ల విలువైన ఇంటికి 8 ఏళ్ల బాలిక యజమాని.. ఈ అద్భుతం ఎలా జరిగింది ?


దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో ఇల్లు కొనడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ద్రవ్యోల్బణం చాలా పెరిగిపోయింది. రెండు గదుల ఫ్లాట్ కొనడం కూడా ప్రజల పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ప్రజలు డౌన్ పేమెంట్ ఇచ్చి ఇంటిని కొనుగోలు చేసినా, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు దాని EMI చెల్లించాల్సి ఉంటుంది. ప్రజల జీవితంలో ఎక్కువ భాగం దీనికే ఖర్చు అవుతుంది. అయితే 8 ఏళ్ల బాలిక కోట్ల విలువైన ఇంటికి యజమాని అయితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఊహించండి. అవును అలాంటి అమ్మాయి ఈ రోజుల్లో వార్తల్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు వివరాలను తెలుసుకుందాం.

ఈ అమ్మాయి పేరు రూబీ మెక్‌క్లెలన్. ఆమె ఆస్ట్రేలియా నివాసి. డైలీ స్టార్ నివేదిక ప్రకారం ఈ అమ్మాయి కేవలం 6 సంవత్సరాల వయస్సులో ఒక ఇల్లు కొనుగోలు చేసింది. అప్పుడు ఆ ఇంటి ధర రూ.3 కోట్లు. ఇంత చిన్న అమ్మాయి కోట్ల విలువ చేసే ఇంటికి ఓనర్ ఎలా అయ్యిందని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

తోబుట్టువులతో కలిసి ఇల్లు కొనుగోలు..

నిజానికి ఆ అమ్మాయి తన ఇద్దరు అన్న, అక్క సహాయంతో రూ.3 కోట్ల విలువైన ఈ ఇంటిని కొనుగోలు చేసింది. రూబీ అన్నయ్య అంగస్ వయసు 14 ఏళ్లు కాగా, సోదరి లూసీ వయసు 13 ఏళ్లు. నిజానికి ఈ ముగ్గురు పిల్లలు కలిసి ఇల్లు కొన్నారు. తన పాకెట్ మనీలో సుమారు రూ.3 లక్షలు పొదుపు చేసి డౌన్ పేమెంట్ గా ఇచ్చారని, మిగిలిన డబ్బు తన తండ్రి ఇవ్వడంతో కొంత డబ్బు ఈఎంఐగా చెల్లిస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో కొనుగోలు చేసిన ఈ ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇక రూబీ తల్లిదండ్రులను ప్రజలు ట్రోల్ చేసి చెడ్డ తల్లిదండ్రులు అని పిలిచినా రూబీ తండ్రి దానికి బాధపడడం లేదు. ఇతరుల పై దృష్టి పెట్టకుండా తమ సమస్యలపైనే దృష్టి సారించి వాటిని అధిగమించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. పిల్లలు పెద్దయ్యాక, ఈ ఇంటిని అమ్మవలసి వస్తే, దానిని అమ్ముతామని, దాని నుండి వచ్చిన డబ్బును ముగ్గురికీ సమానంగా పంచుకుంటామని రూబీ తండ్రి చెప్పారు.



Source link

Related posts

ఈ డ్రింక్‌ వల్ల సులువుగా బరువు తగ్గుతారట..?

Oknews

ఏకకాలంలో ఏసీ – ఫ్యాన్ వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Oknews

మీ ప్రేమ గెలవాలా.. ఈ మొక్కతో ప్రపోస్ చేయండి!

Oknews

Leave a Comment