దిశ, ఫీచర్స్ : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. మనిషి శరీరం ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు ఆరోగ్యంగా ఉండగలదు. కానీ నీరు లేకుండా 7 రోజులు మాత్రం జీవించడం చాలా కష్టం. అయితే ఓ వ్యక్తి మాత్రం నీరు లేకుండా 1 కాదు 2 కాదు ఏకంగా యాభై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. ఏది తిన్నా, దాహం వేసినా కోకాకోలా తాగుతూ గత 50 ఏళ్లుగా బతికే ఉన్నానని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఇంతకీ ఈ విచిత్ర కరమైన వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెజిల్‌లోని బహియాలో నివసిస్తున్న 70 ఏళ్ల రాబర్ట్ పెడ్రీరాను కోకా కోలాకు పెద్ద ఫ్యాన్. ఓ న్యూస్ వెబ్‌సైట్ ఇచ్చిన నివేదికల ప్రకారం ఆ వ్యక్తి గత 50 సంవత్సరాలుగా కోకాకోలా మాత్రమే తాగుతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంత కోక్ తాగుతున్న ఆ వ్యక్తికి డయాబెటిస్, గుండె జబ్బులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అతను కోకాకోలా తాగడం మాత్రం మానుకోవడం లేదంట.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి మందులను నీళ్లతో కాకుండా కోక్‌తో తీసుకుంటానని అక్కడి వైద్యులతో చెప్పాడట. ఇక్కడే అర్థం అవుతుంది అతనికి కోక్ అంటే ఎంత ఇష్టమో. ఇప్పటికే అతని గుండెలో 6 స్టెంట్లు ఉన్నాయట. అయినప్పటికీ ఈ సీతయ్య ఎవరి మాట వినకుండా కంటిన్యూగా కోక్ తాగుతూనే ఉంటున్నారట.
తన అభిరుచి గురించి ఆ వ్యక్తి మాట్లాడుతూ తనకు 70 ఏళ్లు నిండాయని, జీవితాన్ని బాగానే గడిపానని, ఇప్పుడు చనిపోయినా ఎవరికీ ఎలాంటి నష్టం రాదని చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వ్యక్తి ఐస్ క్రీమ్ తినే సమయంలో కూడా కోక్ తాగుతాడట. ఆ వ్యక్తి కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను అబద్ధం చెబుతున్నాడని చాలా మంది అనుకున్నారు. కాని రాబర్ట్ 27 ఏళ్ల మనవడు తన తాత నీరు తాగడం ఎప్పుడూ చూడలేదని చెప్పడంతో ప్రజలు దాన్ని నమ్మడం ప్రారంభించారట.
E meu padrinho que o ÚNICO líquido que ele bebe há mais de 30 anos é Coca Cola. Sim, ele não bebe nenhum outro líquido que não seja Coca Cola, nem água. A imagem da direita não me deixa mentir pic.twitter.com/s8cAqn719Z
— João Victor 🃏 (@ijoaovv) February 24, 2024