ఏపీ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉత్తీర్ణత శాతాలు(AP Schools 10th pass Percentage)
- ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్- 98.43
- ఏపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్- 98.43
- ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్- 96.72
- ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్- 94.56
- ఏపీ మోడల్ స్కూల్స్- 92.88
- ఏపీ ఆశ్రమ పాఠశాలలు-90.13
- ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్- 89.64
- ఏపీ కస్తూర్బా బాలిక పాఠశాలలు- 88.96
- ఏపీ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్- 80.01
- ఏపీ మున్సిపల్ స్కూల్స్ -75.42
- ఏపీ గవర్నమెంట్ హైస్కూల్స్- 74.40
- ఏపీ జిల్లా పరిషత్ హైస్కూల్స్- 73.38
మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ
ఏపీ పదో తరగతి ఫలితాల్లో 69.26 శాతం మంది ఫస్ట్ క్లాస్‌లో పాస్ కాగా, 11.87 శాతం సెకండ్ క్లాస్, 5.56 శాతం మంది థర్డ్ క్లాస్‌లో సాధించారు. మే 24 నుంచి జూన్ 3 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు(AP SSC Supplementary Exams ) నిర్వహించనున్నారు. రేపటి(ఏప్రిల్ 23) నుంచి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మరో 4 రోజుల్లో ఎస్ఎస్.సి వెబ్‌సైట్ నుంచి టెన్త్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.