దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వలన ఒక్కోరాశికి ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఫిబ్రవరి9న అమావాస్య. ఇది 70ఏళ్ల తర్వాత మౌని అమావాస్య వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.ఈరోజు నదుల్లో స్నానమాచరించడం చాలా మంచిదంట. అంతే కాకుండా చాలా ఏళ్ల తర్వాత ఏర్పడే ఈ మౌని అమావాస్య వలన ఈ రాశుల వారకి చాలా అదృష్టం కలుగుతుందంట. అవి ఏ రాశులో ఇప్పుడు చూద్దాం.
మేషరాశి : మేష రాశి వారికి మౌని అమావాస్య వలన పట్టిందల్లా బంగారమే కానున్నదంట. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.
వృషభరాశి : ఈ రాశి విద్యార్థులకు ఈ అమావస్య కలిసి వస్తుంది. వ్యాపారస్తు, ట్రేడ్ వర్గాల వారు మంచి లాభాలను పొందుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.
మకర రాశి : ఈరోజు మకర రాశిలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా మకర రాశి వారికి అద్భుత ఫలితాలు అందబోతున్నాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు పెరుగుతాయి.
మీన రాశి : మీన రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతీ పనుల్లో విజయం వీరి సొంతం అవుతుంది.