Top Stories

విశాఖకు జై కొట్టిన కేంద్రం


విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది ప్రస్తుతం న్యాయ స్థానంలో విచారణ దశలో ఉంది. ఈ లోగా కేంద్రం విశాఖకు భారీ బహుమతినే అందించింది. విశాఖను ఏపీలోనే కాదు దక్షిణాదినే వన్ అండ్ ఓన్లీ సిటీగా నీతి అయోగ్ గుర్తించడం జగన్ సర్కార్ ఆలోచనలకు ఆమోదం తెలిపినట్లే అంటున్నారు. ఏపీలో పొటొన్షియాలిటీ ఉన్న ఏకైక సిటీ విశాఖ అని వైసీపీ ఎపుడో గుర్తించింది. కేంద్రం కూడా విశాఖకే ఓటు వేయడం ద్వారా అభివృద్ధి చేస్తామని అంటున్నారు.

దేశం 2047 దిశగా అభివృద్ధి ఫోకస్ పెట్టుకుని కేంద్రం ఆనాటికి ప్రగతిపధంలో నడవాల్సిన నగరాలను గుర్తించింది. వీటిలో ఉత్తరాది నుంచి మూడు ఉంటే దక్షిణాది నుంచి నాలుగు రాష్ట్రాలకూ ఒకే ఒక సిటీని ఎంపిక చేసింది. అదే విశాఖపట్నం. నీతి అయోగ్ గ్రోత్ హబ్ నగరాల్లో విశాఖకు అలా చోటు కల్పించింది.

దేశంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరలాలో విశాఖను నీతి అయోగ్ ఎంచుకుంది. వీటిని పైలెట్ సిటీలుగా డెవలప్ చేస్తారు. నీతి అయోగ్ ఎంపికతో విశాఖ దశ తిరగనుంది. కేంద్రం పెద్ద ఎత్తున నిధులను విశాఖలో వెచ్చించనుంది. అలా ఆర్ధిక అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను కూడా డెవలప్ చేయనుంది.

విశాఖలో పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి. అలాగే సీ, రైల్వే, ఎయిర్ రోడ్ కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉంది. ఇపుడు కేంద్రం చేయూతను ఇస్తే విశాఖ సౌత్ లోనే నంబర్ వన్ సిటీగా మారనుంది. వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలనా రాజధాని చేయాలనుకోవడం వెనక కూడా విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలే కారణం అంటున్నారు. ఈ విజయదశమి నుంచి జగన్ విశాఖకు మకాం మార్చనున్నారు. ఆయన విశాఖ నుంచి తన కార్యకలాపాలు మొదలెట్టనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మీద ఫోకస్ పెట్టిన నేపధ్యంలో కేంద్రం కూడా విశాఖను ఎంపిక చేయడం శుభ పరిణామం అని అంటున్నారు.  ఈ మధ్య కాలంలోనే నీతి అయోగ్ సీఈవో సుబ్రమణ్యం విశాఖలో అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. విశాఖ అభివృద్ధి ప్రణాళికలపైన చర్చించారు. విశాఖ అభివృద్ధి గల అవకాశాలను ఆయన తెలుసుకున్నారు. దాంతో ఇపుడు నీతి అయోగ్ విశాఖను గ్రోత్ హబ్ సిటీలలో ఒకటిగా ఎంపిక చేయడంతో విశాఖ ప్రగతి ఇక పరుగులు తీయడం ఖాయమని అంటున్నారు.



Source link

Related posts

సంక్రాంతి బ్లాక్ బస్టర్ కు సీక్వెల్

Oknews

బైరెడ్డి.. ఇదేం రాజ‌కీయం రెడ్డి!

Oknews

ఏపీలో కూడా కాంగ్రెసు టికెటుకు ఒక రేటు!

Oknews

Leave a Comment