GossipsLatest News

Alliances are ok Senani.. where are the guards! పొత్తులు సరే సేనాని.. కాపులు ఎటు!



Wed 20th Sep 2023 04:40 PM

pawan kalyan  పొత్తులు సరే సేనాని.. కాపులు ఎటు!


Alliances are ok Senani.. where are the guards! పొత్తులు సరే సేనాని.. కాపులు ఎటు!

ఏదో జైలుకెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించి వస్తారనుకుంటే జనసేన అధినేత బాంబు పేల్చారు. టీడీపీ పొత్తు ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. ఇది వైసీపీకే కాదు.. జనసేన పార్టీకి కూడా షాకే. ఇక బీజేపీకి అయితే ఇది ఊహించని పరిణామమే. ఏదో తమతో చర్చిస్తారు. ఆ తరువాత పొత్తుపై ఓ నిర్ణయానికి వెళతారని బీజేపీ నేతలు భావించారు. కానీ నేరుగా పవన్ అధికారిక ప్రకటనే చేశారు. మరోవైపు కాపు సామాజిక వర్గం ఈ పొత్తుపై రగిలిపోతోంది. 

జనసేన ద్వారా కాపులకు అధికారం వస్తుందని భావించిన వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. పవన్ తీసుకున్న నిర్ణయంతో తమకేంటని కాపు సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది. పెద్ద ఎత్తున ఈ పొత్తు గురించి కాపు సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ ఈ పొత్తుతో కేవలం టీడీపీని ముందుకు నడిపించి తను మాత్రం ఉన్న చోటనే ఆగిపోతాడా? అనే సంశయం వారిలో నెలకొంది. ఒకవేళ గెలిస్తే.. పవన్‌కు కనీసం రెండున్నరేళ్లయినా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారా? అనే సంశయం నెలకొంది. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు కోసం తామెందుకు బలి కావాలనే ప్రశ్నలు కాపుల్లో తలెత్తుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌లో అధికారం గడచిన 60 ఏళ్లుగా రెండు సామాజిక వర్గాల మధ్యే షేర్ అవుతోంది. పవన్ కారణంగా తమ సామాజిక వర్గానికి కూడా అధికారం చేజిక్కుతుందని భావించిన వారికి నిరాశే మిగులుతోంది. ఒకవేళ పవన్‌కు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే మాత్రం కాపులు మొత్తం ఈ కూటమి వైపే ఉంటారు. లేదంటే మాత్రం కాపుల ఓటు బ్యాంకును దాదాపు పవన్ దూరం చేసుకున్నట్టే అని ఆ  సామాజిక వర్గ నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Alliances are ok Senani.. where are the guards!:

Pawan Kalyan announces JSP, TDP alliance









Source link

Related posts

CM Revanth Reddy Bahubali: బాహుబలి సినిమాలో కాలకేయుడి పాత్ర వేసిన ప్రభాకర్ ది సీఎం ఊరేనంట..!

Oknews

Pawan Kalyan Announce To Pithapuram Contest పవన్ ప్రకటన.. టీడీపీ శ్రేణుల ప్రకంపన

Oknews

Telugu News Today From Andhra Pradesh Telangana 01 March 2024 | Top Headlines Today: జగన్‌ను ఓడిస్తేనే వివేకా హత్య కేసులో న్యాయం

Oknews

Leave a Comment