నవదీప్ పిటిషన్ కొట్టివేత
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారించింది. అయితే నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. ఈ కేసులోని నిందితులతో నవదీప్ కు సంబంధాలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు… 41 ఏ కింద నోటీసులు ఇచ్చి నవదీప్ ను విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నవదీప్ అరెస్ట్ తప్పదా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ కేసులో నార్కోటిక్ బ్యూరో దూకుడు పెంచే పనిలో ఉంది. హైకోర్టు ఆదేశాలతో నవదీప్ కు 41ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు. నవదీప్‌తో పాటు మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెల 23న నవదీప్‌ను విచారణకు పిలిచారు. ఇప్పటికే విచారణకు సహకరించాలంటూ నవదీప్‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో…. నవదీప్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.