GossipsLatest News

నేను కూడా చనిపోయా: విజయ్ ఆంటోని


నటుడు విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోని ఈనెల 19 మంగళవారం తెల్లవారుఝామున తన సొంత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోని మరణంతో విజయ్ భార్య, విజయ్, ఆయన తల్లి తల్లడిల్లిపోయారు. విజయ్ ఆంటోనీని పరామర్శించేందుకు, మీరాని చివరి చూపు చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, విజయ్ అభిమానులు విజయ్ ఆంటోని ఇంటికి వచ్చారు. కుమార్తె మరణంతో దుఃఖసాగరమైన విజయ్ ఆంటోని కూతురుకి విషణ్ణవదనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. 

అయితే కుమార్తె చనిపోయిన మూడోరోజు అంటే ఈరోజు విజయ అంటోని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ లేఖని షేర్ చేసారు. ఆ లేఖలో విజయ్ ఇలా రాసుకొచ్చారు. నా కూతురు మీరా చాలా ధైర్యవంతురాలు. అందరితో ప్రేమగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషంలాంటివి ఏమి లేని ఓ మెరుగైన.. ప్రశాంతమైన ప్రపంచానికి వెళ్లిపోయింది.

నా కూతురు నాతో మాట్లాడుతోంది. నా కూతురు లేని నేను లేను. నేను కూడా చనిపోయా, నేను ఇప్పుడు నా కూతురుతో సమయం గడుపుతున్నాను. ఇకపై నేను చేయబోయే ప్రతి మంచి పని ఆమె పేరు మీదనే ప్రారంభిస్తాను.. అంటూ ఎమోషనల్ గా విజయ్ ఆంటోని షేర్ చేసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆయన అభిమానులు ఆయనికి ధైర్యాన్ని చెబుతున్నారు.



Source link

Related posts

Stone Attack On Chandrababu చంద్రబాబుకి కూడా స్పాట్ పెట్టారు

Oknews

'ఓజీ' నుంచి మెంటలెక్కించే పోస్టర్

Oknews

బైరెడ్డి.. ఆ ఆడబిడ్డల కన్నీళ్లు నీకు కనిపించలేదా..

Oknews

Leave a Comment