Entertainment

పాట చిత్రీకరణలో హీరోయిన్‌, డైరెక్టర్‌ మధ్య గొడవ! 


ఒక సినిమాను షూట్‌ చెయ్యడం ఒక ఎత్తయితే, అందులోని పాటల చిత్రీకరణ మరో ఎత్తు. ఒక్కోసారి పాటల చిత్రీకరణ కోసం హీరో, హీరోయిన్‌ నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లకు కొన్ని సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందే హీరోయిన్‌ నేహాశెట్టి ఎదుర్కొంది. ఓ పాట చిత్రీకరణ కోసం 5 డిగ్రీల చల్లని నీళ్ళలో దిగాల్సి వచ్చింది. నీళ్ళలో క్లోరిన్‌ ఉంది, అందులోకి హీరోయిన్‌ని పంపాలంటే ఇబ్బంది. అందుకే షాట్‌ చేయొద్దని తనతో అన్నానని డైరెక్టర్‌ అంటున్నాడు. కానీ, హీరోయిన్‌ మాత్రం అంత చల్లటి నీళ్ళనూ భరించి నాలుగైదు షాట్లు చేసింది. ఇక తట్టుకోలేక బయటికి వచ్చేసింది. దాంతో డైరెక్టర్‌ ఆమెతో గొడవకు దిగాడు. మరో నాలుగైదు షాట్లు తియ్యాలి అని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ తర్వాత కొన్ని నెలలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. అయితే పాట మాత్రం బాగా వచ్చిందట. పాట బాగా వచ్చినందుకు సంతోషించాలో, గొడవ పడ్డందుకు బాధపడాలో తెలీక ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. 

ఇంతకీ ఎవరా హీరోయిన్‌? ఎవరా డైరెక్టర్‌ అంటే…. ఆ హీరోయిన్‌ నేహాశెట్టి, ఆ డైరెక్టర్‌ రత్నంకృష్ణ. కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటిస్తున్న రూల్స్‌ రాంజన్‌ చిత్రం కోసం సమ్మోహనుడా.. పాట చిత్రీకరణ సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం సినిమా ప్రమోషన్‌లో బహిర్గతం అయింది. ఈ సినిమా అక్టోబర్‌ 6న విడుదల కానుంది. ఇంత రచ్చ జరిగిన ఈ పాట సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి. 



Source link

Related posts

telugu anchor anasuya complaint on social media

Oknews

ఆర్టికల్ 370 కి వచ్చిన కలెక్షన్లు 

Oknews

ఆర్జీవీ డెన్ లో అమితాబ్ బచ్చన్..వ్యూహం త్వరలో!

Oknews

Leave a Comment