Latest NewsTelangana

TSPSC Has Released Junior Lecturers Exam Halltickets, Download Now


తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, సబ్జెక్టు వివరాలు నమోదుచేసి హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 29న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, హిస్టరీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్‌ 3న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక అభ్యర్థి రెండు పరీక్షలకు దరఖాస్తు చేస్తే వేర్వేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 

జేఎల్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్షవిధానంమొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

పోస్టుల వివరాలు: 1392

మల్టీ జోన్-1: 724 పోస్టులు

– ఆసిఫాబాద్-కుమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
– ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
– కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
– కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూలర్)

మల్టీ జోన్-2: 668 పోస్టులు

– సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి-యాదాద్రి, జనగామ
– మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
– మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు

నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  ALSO READ:

ఎస్‌బీఐలో 439 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులు, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 439 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 6లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

డిగ్రీ అర్హతతో 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఈ పోస్టుల‌ను ఐడీబీఐ భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంట‌ర్న్‌షిప్‌, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

Family Star Vijay Deverakonda in Tension టెన్షన్‌లో విజయ్ దేవరకొండ

Oknews

Komatireddy Venkat Reddy Jagadish Reddy Makes Accuses Eachother In Nalgonda | Komatireddy Vs Jagadish Reddy: కేసీఆర్ తర్వాత జైలుకు వెళ్లేది ఆ మాజీ మంత్రే

Oknews

మణిరత్నంలా గొప్ప డైరెక్టర్‌ అవ్వాలనుకున్నాడు.. నేచురల్‌ స్టార్‌ అయ్యాడు!

Oknews

Leave a Comment