నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి వ్యతిరేకంగా తన గళం వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ట్విట్టర్ లో బండ్ల గణేష్ పేరుతో ఓ షాకింగ్ కామెంట్ కనిపించింది. చాలామంది ఇది బండ్ల కామెంటే అనుకున్నారు. అయితే బండ్ల మాత్రం ఆ కామెంట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
“హలో.. లోకేష్ గారు!. తమరి లొకేషన్ ఎక్కడ?” అంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ కి “ఏ వెళ్ళి కడుగుతావా” అంటూ బండ్ల గణేష్ పేరుతో దారుణమైన రిప్లై వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ కామెంట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో బండ్ల స్పందించారు. “ఈ ట్వీట్ కి నాకు ఏమాత్రం సంబంధం లేదు. దయచేసి తప్పుడు ట్వీట్స్ నా పేరు మీద వేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు” అని బండ్ల ట్వీట్ చేశారు.