Top Stories

చంద్రముఖి-2 పోస్ట్ పోన్ వెనక అసలు రీజన్!


ఊహించని విధంగా చంద్రముఖి-2 సినిమా వాయిదా పడింది. 15వ తేదీన రావాల్సిన ఈ సినిమాను 28వ తేదీకి షెడ్యూల్ చేశారు. కేవలం సాంకేతిక కారణాల వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని ఇప్పటికే ప్రకటించారు. ఈ వాయిదాకు అసలు కారణాన్ని దర్శకుడు పి.వాసు బయటపెట్టారు.

"సినిమా మొత్తం రెడీ చేసి, ఓసారి చూసుకోవాలని అనుకున్నాం. అలా రఫ్ గా ఓసారి చూసుకొని, 15వ తేదీ రిలీజ్ అని ఎనౌన్స్ చేశాం. అలా రెడీ చేసిన తర్వాత, సడెన్ గా ఓ రాత్రి నాకు ఎడిట్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. 480 ఫైల్స్ కనిపించలేదని చెప్పారు. అన్నీ పంపించామని సీజీ వాళ్లు చెప్పారు. దీంతో మిస్సయిన షాట్స్ కోసం కంప్లీట్ గా వెదకాల్సి వచ్చింది. అలా 4-5 సార్లు వెదికి ఆ షాట్స్ ను వెనక్కు తీసుకొచ్చాం. దాని కోసమే వాయిదా వేశాం."

ఇలా సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వెనక అసలు కారణాన్ని బయటపెట్టారు దర్శకుడు. ఇతర సినిమాలతో ఉన్న కాంపిటిషన్ ను దృష్టిలో పెట్టుకొని ఇలా చేశారనే వాదనతో ఆయన ఏకీభవించలేదు. సినిమాను వాయిదా వేయాలని ఎవ్వరూ అనుకోరని, తప్పనిసరి పరిస్థితుల్లో రిలీజ్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.  

రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు కాంబినేషన్ లో 17 ఏళ్ల కిందట వచ్చిన చంద్రముఖి సినిమా ప్రభంజనం సృష్టించింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. అయితే ఈసారి రజనీకాంత్ లేరు. ఆయన ఆశీస్సులతో, రజనీ పాత్రలో లారెన్స్ కనిపించబోతున్నాడు. ఇక జ్యోతిక పాత్రలో కంగనా రనౌత్ కనిపించనుంది.

ఈసారి ఓ కొత్త కథనే చంద్రముఖి స్టయిల్ చెప్పామంటున్నారు దర్శకులు పి.వాసు. భవిష్యత్తులో చంద్రముఖి-3 తీస్తే, అందులో రజనీకాంత్-లారెన్స్ కలిసి నటించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. కథ నచ్చితే రజనీకాంత్ దేనికైనా ఓకే చెబుతారని మాత్రమే అన్నారు పి.వాసు.



Source link

Related posts

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే కామెడీ.. న‌వ్వులే న‌వ్వులు!

Oknews

మరో లాంగ్ వీకెండ్.. ఏ సినిమాకు ప్లస్?

Oknews

జ‌గ‌న్‌ను ఎంత తిడితే… అంత!

Oknews

Leave a Comment