Telangana

కోదాడ బీఆర్ఎస్ లో ముదిరిన వివాదం, స్వతంత్ర అభ్యర్థిగా శశిధర్ రెడ్డి పోటీ!-kodad brs dissident leaders ready to contest independent if bollam mallaiah candidate ,తెలంగాణ న్యూస్


అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశం

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ప్రకటించడానికి ఆరు నెలల ముందు నుంచే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దన్న డిమాండ్ తో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు నాయకత్వంలో పార్టీ నాయకులు శశిధర్ రెడ్డి, ఎర్నేని బాబు, మహ్మద్ జానీ, పాండురంగారావు తదితర నాయకులు జట్టుకట్టి ప్రయత్నిస్తున్నారు. కానీ, వీరి అసమ్మతిని ఏ మాత్రం పట్టించుకోని పార్టీ హై కమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కే టికెట్ కట్టబెట్టింది. ఇక, అప్పటి నుంచి ఈ అసమ్మతి నాయకులు మరింతగా తమ వాదనలు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను దగ్గరకు తీసి బుజ్జగిస్తున్న నాయకత్వం కోదాడ విషయంలో ఇంకా చొరవ చూపడం లేదు. దీంతో తమ తమ మద్దతు దారులతో అసమ్మతి నాయకులు తాజాగా మరో మారు సమావేశమై కోదాడ టికెట్ తమలో ఒకరికి ఇవ్వాల్సిందేనని, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టికెట్ రద్దు చేయాల్సిందేని పట్టుబడుతున్నారు.



Source link

Related posts

Madhavi Latha On Kavitha Arrest: కవిత అరెస్టుపై స్పందించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

Oknews

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు, ఈ నెల 23న విచారణ-hyderabad narcotic police notices to hero navdeep to attend investigation on september 23rd ,తెలంగాణ న్యూస్

Oknews

ఈ నెల 11న భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల చేరికకు రామయ్య సన్నిధి నుంచే శ్రీకారం?-bhadradri news in telugu cm revanth reddy visits bhadrachalam on march 11th brs mla tellam joins ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment