Uncategorized

10 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, మహిళా రిజర్వేషన్ కు మద్దతుగా తీర్మానం!-ap assembly session 10 bills passed resolution on women reservation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు కీలక బిల్లులను ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసైన్డ్ ల్యాండ్స్-భూముల రీసర్వేపై స్వల్పకాలిక చర్చ జరిగింది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లు, ఏపీజీఎస్టీ సవరణ బిల్లు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే చట్ట సవరణ బిల్లు, ఏపీ మోటార్ వెహికల్స్ ట్యాక్సెస్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ రవాణా వాహనాల పన్నుల చట్టంలో రెండో సవరణ బిల్లు, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు, ఏపీ భూదాన్- గ్రామదాన్ సవరణ బిల్లు, హిందూ ధార్మిక చట్టం సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించింది. నేటి సమావేశాలను ప్రతిపక్ష పార్టీ టీడీపీ శాసన సభ్యులు బహిష్కరించారు. దీంతో విపక్షం లేకుండానే మొత్తం 10 బిల్లుల‌కు ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది.



Source link

Related posts

చంద్రబాబు ప్రాణానికి ఏ ముప్పులేదు, మావోయిస్టుల బెదిరింపు లేఖ ఫేక్- డీఐజీ రవికిరణ్-rajahmundry dig ravi kiran says maoist threat letter to chandrababu fake full security provided ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పొత్తులు జనహితం కోసమా..? రాజ్యాధికారం కోసమా..?

Oknews

TTD Brahmotsavalu: బ్రహ్మోత్సవాల్లో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం

Oknews

Leave a Comment