Top Stories

పండగలు, పబ్బాలు మరిచిపోయి పనిచేశాడంట


ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొచ్చాడు మంచు విష్ణు. న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్లలో కన్నప్ప ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు. తన ఏడేళ్ల శ్రమ, కల ఇన్నాళ్లకు సాకారం అయిందని చెప్పుకొచ్చాడు.

" న్యూజిలాండ్‌లో కన్నప్ప షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. ఆ శివపార్వతుల ఆశీస్సులతోనే ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది. ఈ సినిమా కోసం గత 8 నెలలుగా టీం అంతా కూడా నిద్రలేని రాత్రులు గడిపింది. పండుగలు, పబ్బాలు కూడా మరిచిపోయి పని చేశాం. కనీసం రోజుకు 5 గంటల నిద్ర కూడా ఉండేది కాదు. ఎంత కష్టంగా అనిపించినా కూడా ఏ ఒక్కరూ అలిసిపోకుండా శ్రమించారు."

ఇలా కన్నప్ప ప్రీ-ప్రొడక్షన్ కోసం కష్టపడిన విషయాన్ని బయటపెట్టాడు విష్ణు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా పని చేస్తున్నారని తెలిపిన ఈ నటుడు.. తమ సినిమాలో సూపర్ స్టార్స్ నటించబోతున్నారంటూ మరోసారి టీజ్ చేశాడు. అయితే ఎంత సీక్రెట్ గా ఉంచుదామని ప్రయత్నించినా, మీడియాలో లీక్ అయిపోతున్నాయంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రభాస్-నయనతార ఎంట్రీని పరోక్షంగా కన్ ఫర్మ్ చేశాడు ఈ హీరో.

ఈ ప్రాజెక్ట్ నుంచి నుపుర్ సనన్ తప్పుకుంది. కొత్త హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. అంతలోనే సినిమా సెట్స్ పైకి వచ్చినట్టు ప్రకటించాడు విష్ణు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకుడు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు మంచు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.



Source link

Related posts

పక్క రాష్ట్రం నుంచి వచ్చి విమర్శలా…?

Oknews

క‌రెంట్ బిల్లు క‌ట్టొద్దు…!

Oknews

వివాదంపై ఎట్టకేలకు స్పందించిన నయనతార

Oknews

Leave a Comment