రామ్‌గోపాల్‌వర్మ, వీరు పోట్ల, రమేష్ వర్మ వంటి దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి మంచి అనుభవం గడిరచిన అజయ్ భూపతి తొలి సినిమాగా రూపొందించిన ‘ఆర్‌ఎక్స్ 100’ సంచలన విజయం సాధించింది. డైరెక్టర్‌గా అజయ్‌కి చాలా మంచి పేరు తెచ్చింది. అయితే ఆ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘మహాసముద్రం’ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లో మరో బ్లాక్‌బస్టర్ కొట్టాలన్న కసితో అజయ్ చేసిన మరో ప్రయత్నం ‘మంగళవారం’. టైటిల్‌లోనే కొత్తదనం ఉండేలా చూసుకున్న అజయ్ సినిమాని కూడా అంతే విభిన్నంగా తీశాడని చిత్ర యూనిట్ చెబుతోంది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో ్రశీతేజ్, చైతన్యకృష్ణ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను టైటిల్‌కి తగ్గట్టుగా మంగళవారమే విడుదల చేశాడు.
ఎంతో ప్రెస్టీజియస్‌గా భావించిన అజయ్ ‘మంగళవారం’ చిత్రాన్ని 99 రోజులపాటు చిత్రీకరించాడు. ఇందులో 51 రోజులు నైట్ షిఫ్ట్ చేశారు. ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాత్రలన్నీ చాలా కొత్తగా ఉంటాయంటున్నాడు అజయ్. సినిమా చూస్తున్నంత సేపు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది చెప్పడం కష్టం అనిపిస్తుంది. ఈ సినిమాలో చాలా మంది కొత్త నటీనటులు పనిచేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని నవంబర్ 17న వరల్డ్‌వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారట. ‘మంగళవారం’ అనే టైటిల్ పెట్టి టీజర్‌ని కూడా మంగళవారమే రిలీజ్ చేశారు. అయితే సినిమా మాత్రం శుక్రవారమే రిలీజ్ కానుంది.